ఏపీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కు కరోనా వైరస్ సోకిందా అనే ప్రచారం జరుగుతోంది. ఆయన గత కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉంటున్నారు. 2020, మార్చి 05వ తేదీన నెల్లూర జిల్లాకు చెందిన ఓ డాక్టర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈయన కొద్ది రోజుల కిందట మంత్రి అనీల్ ను కలిశారు. ఈ విషయం మంత్రి అనీల్ కు తెలిసింది. దీంతో ఆయన కరోనా పరీక్షలు చేసుకున్నారు. ఈ పరీక్షల్లో నెగటివ్ రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
కానీ నెగటివ్ వచ్చినా బయటకు రాకపోవడం మంచిదని మంత్రి అనీల్ అనుకున్నట్లు సమాచారం. దీంతో ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. ప్రస్తుతం నెగటివ్ రావడంతో.. 2020, ఏప్రిల్ 07వ తేదీ మంగళవారం ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తారని సమాచారం. (కరోనా డ్యూటీ తప్పలేదు పాపం: పాప పుట్టినా గేట్ దగ్గరే నిల్చొని చూసుకున్న ఆఫీసర్)
కరోనా భయం ఎవరినీ వదలడం లేదు. ప్రముఖులకు సైతం ఈ మహమ్మారీ సోకింది. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఎంతో మంది బలవుతున్నారు. లక్షలాది మంది వైరస్ బారిన పడి..చికిత్స పొందుతున్నారు. భారతదేశంలోకి ప్రవేశించింది. నాలుగువేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం ప్రభావం చూపుతోంది. ఏపీలో కరోనా స్పీడుగా విజృంభిస్తోంది.
పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కర్నూలు, నెల్లూరు, గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.
2020, ఏప్రిల్ 06వ తేదీ సోమవారం 37 కేసులు వస్తే..మంగళవారం ఒకరికి నెగటివ్ వచ్చింది. దీంతో కేసుల సంఖ్య 304కు చేరాయి. ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు. ఆరుగురు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నెల్లూరులో 42 పాజిటివ్ కేసులు వస్తే..ఒకరు మాత్రమే డిశ్చార్జ్ అయ్యారు.