Minister Botsa Satyanarayana : పదేళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యం? సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి బొత్స క్లారిటీ

హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది మా పార్టీ విధానం కాదని, వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Minister Botsa Satyanarayana

Botsa Satyanarayana : హైదరాబాద్ ను మరికొద్దికాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యాలపై వైఎస్ఆర్ సీపీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది మా పార్టీ విధానం కాదని, వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనుభవం ఉన్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేస్తారా. 10ఏళ్ల తరువాత అది ఎలా సాధ్యమవుతుందని బొత్స అన్నారు. హైదరాబాద్ విశ్వనగరం.. అది ఏమైనా వేముల ప్రశాంత్ రెడ్డి సొంత ఆస్తినా.? తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. అర్థరాత్రి చంద్రబాబు పారిపోయి వచ్చిన కారణంగా ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని బొత్స విమర్శించారు.

Also Read : Adala Prabhakara Reddy: నెల్లూరు వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. పార్టీ మార్పుపై క్లారిటీ

హైదరాబాద్ లో ఎవరికైనా ఆస్తులు ఉండవచ్చు. నాకు హైదరాబాద్ లో ఇల్లు ఉంది. ఏపీలో మంత్రిని అయితే, హైదరాబాద్ లో నా ఆస్తిని ప్రభుత్వం కబ్జా చేస్తుందా? ఏపీలో ఓట్లు, డోర్ నెంబర్ లు కూడా లేనివాళ్లు రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు.. మీ అడ్రస్ ఏదీ అంటే వాళ్లు పక్కింట్లో డోర్ నెంబర్ చెప్పే పరిస్థితి. రాజధానిపై కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి లబ్ధి పొందాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదని బొత్స అన్నారు. ఉమ్మడి రాజధాని మా పార్టీ విధానం కాదంటూ క్లారిటీ ఇచ్చారు. విభజన చట్టంలో అప్రస్తుతంగా ఉన్న సమస్యల పరిష్కారంకోసం ప్రయత్నిస్తానని మాత్రమే సుబ్బారెడ్డి చెప్పారని బొత్స అన్నారు.

Also Read : Adala Prabhakara Reddy: నెల్లూరు వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. పార్టీ మార్పుపై క్లారిటీ

వచ్చే ఎన్నికల్లో మాది ఒంటరి పోరాటం. ప్రతిపక్ష పార్టీలు ఏ డొంకల్లోకి, సందుల్లోకి దూరుతాయో వాళ్ల ఇష్టం. మా నైతికత మాకు ఉంది. ఎవరెన్ని విధాలుగా వచ్చిన ఎదుర్కొంటాం. ఐదేళ్ల అభివృద్ధి, సంక్షేమం చూసి ఓటేయమని అడుగుతున్నామని బొత్స అన్నారు. ఉద్యోగులకు బకాయిలు అనేది కొత్తకాదు. ప్రభుత్వంగా కొంత ఆలస్యం అయినా అన్ని పరిష్కారం చేస్తామని చెప్పారు. పీఎఫ్ సహా అన్ని బకాయిలు ఒకటి రెండు నెలల్లో తీరుస్తాం. ఉద్యోగుల ఆందోళన ఎందుకో నాకు తెలియదు. ఇప్పటికే అనేక మార్లు చర్చలు జరిపాం అని బొత్స పేర్కొన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు