Adala Prabhakara Reddy: నెల్లూరు వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. పార్టీ మార్పుపై క్లారిటీ

నెల్లూరు రూరల్ లో ఆనం విజయకుమార్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని వస్తున్న ప్రచారంపై ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పందించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసినంత మాత్రాన ..

Adala Prabhakara Reddy: నెల్లూరు వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. పార్టీ మార్పుపై క్లారిటీ

YCP Nellore MP Adala Prabhakara Reddy

Updated On : February 14, 2024 / 12:01 PM IST

Nellore MP : నెల్లూరు వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను చంద్రబాబును కలిశానని.. పార్టీ మారుతానని కొన్ని మీడియాల్లో ఏడాది నుంచి దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రతిసారి నేను క్లారిటీ ఇస్తున్నాను. నేను పార్టీ మారే ప్రసక్తే లేదని అన్నారు. వైసీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. నెల్లూరు రూరల్ నుంచి అసెంబ్లీకా? నెల్లూరు లోక్ సభకా అనేది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం బట్టి ఉంటుందని అన్నారు. త్వరలో జగన్ ను కలుస్తానని చెప్పారు.

Also Read : ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌.. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యల వెనుక పక్కా ప్లాన్?

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కూడా చర్చలు జరిపాను.వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాత్రం తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఆయనను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించాను. నా ప్రయత్నం ఫలించలేదు. అదే విషయాన్ని అధిష్టానానికి చెప్పాను. మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాత్రం పార్టీలోనే కొనసాగాలని అనుకుంటున్నాడు. కానీ, వైసీపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని అంటున్నాడని ఆదాల చెప్పారు.

Also Read : పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన వాయిదా, కారణం ఏంటంటే..

నెల్లూరు రూరల్ లో ఆనం విజయకుమార్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని వస్తున్న ప్రచారంపై ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పందించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసినంత మాత్రాన ఎన్నికల్లో పోటీ చేస్తారని అనుకోవడం సరికాదు. నెల్లూరు సిటీ, రూరల్ లో పార్టీకి మరింత సహకారం అందించమని కోరి ఉండవచ్చు. తన విషయంలో కొన్ని మీడియా సంస్థలు మాత్రం వారికి ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నాయని ఆదాల ఆవేదన వ్యక్తం చేశారు.