Dharmana Prasada Rao
Dharmana Prasada Rao : అభివృద్ధికి నిధులు లేవని, అభివృద్ధి జరగడం లేదని అబద్దపు ప్రచారం చేస్తున్నారు.. అన్ని విధాల రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంకు 12 కోట్ల రూపాయల జీవో విడుదల పై క్రీడా సంఘాల థ్యాంక్స్ టు సీఎం, జయహో ధర్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకన్నా.. పట్టణ ప్రజల ఆకాంక్ష స్టేడియం అభివృద్ధి చేస్తున్నామని, అందుకే దీనికి ప్రాధాన్యత ఇచ్చి నిధులు విడుదల అయ్యాయని అన్నారు. ఇదే గ్రౌండ్ లో జగన్మోహన్ రెడ్డికి చెప్పిన విధంగా జీవోకు సంబంధించిన నిధులు రావడం జరిగిందని అన్నారు. మాట మీద నిలబడ్డ కుటుంబం వారిది.. వారికి కృతజ్ఞతలు చెబుదామని ధర్మాన అన్నారు.
అభివృద్ధికి నిధులు లేవని, జరగడం లేదని అబద్దపు ప్రచారం చేస్తున్నారని, ఓవరాల్ అభివృద్ధి జరుగుతోందన్నారు. పేదల ఇళ్లు, వైద్యం నిరంతరం అందితే అది అభివృద్ధి. రాజకీయ ప్రత్యర్ధులు భిన్నమైన కోణాల్లో అభివృద్దికోసం చెబుతారు. జాతీయ స్థాయిలో ఏపీ అభివృద్ధి నాలున్నర సంవత్సరాల్లో ముందుకు వచ్చింది.. మీ వద్ద కంప్యూటర్లు ఉంటాయిగా సూచిల్లో చూడండి అంటూ ప్రతిపక్షాలకు ధర్మాన సూచించారు. మోడల్ కలెక్టరేట్ ను డిజైన్ ఆనాడు చేయించాను.. ఇప్పుడు ఫిబ్రవరికి తయారు అవుతుందని చెప్పారు. ఎవరైనా పనికోసం వస్తే అన్ని ఓకేచోట తన పని చేసుకొని వెళ్లేలా కలెక్టరేట్ ఉండాలని రూపకల్పన చేశామని చెప్పారు.
పట్టణంలో క్రీడాకారులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ నుండి ప్రతిభగల వారిని వెలికితీస్తాం. పట్టణంలో ప్రతీ రోడ్డును పిబ్రవరిలో గా పూర్తి చేస్తాం.. ఒక్క లైటు ఆరకుండా చూస్తున్నాం.. ప్రతీ ఇంటికి నీరు అందిస్తున్నామని మంత్రి అన్నారు. రిమ్స్ లో పూర్తిగా వైద్య సిబ్బందిని నియమించాం. అత్యవసర వైద్యంకోసం జిల్లా వాసులు గతంలో రిమ్స్ కు వస్తే కేజీహెచ్ విశాఖ కు తరలించే వారు. ఇప్పుడు దానికి పరిష్కారం చూపామని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.