Gudivada Amarnath.. Ambati Rambabu
Gudivada Amarnath.. Ambati Rambabu car accident : ఖమ్మం జిల్లా సత్తుపల్లి శివారులో ఏపీ మంత్రి అంబటి రాంబాబు కారు ప్రమాదంనుంచి తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. అది ప్రమాదం కాదని తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. దీనిపై మంత్రి అమర్నాథ్ మాట్లాడుతు…అక్టోబర్ 27 న మంత్రి అంబటి రాంబాబు ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనటానికి వెళుతుండగా దాడి జరిగిందని..ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఆయనపై కావాలనే వ్యక్తి గతంగా దూషించి దాడులకు ప్రయత్నిస్తున్నారు అంటూ మండిపడ్డారు. అంబటిపై జరిగిన దాడి కాపు కులం మీద జరిగిన దాడిగా భావిస్తున్నామని అన్నారు. ఒక సామాజిక వర్గం దూషించి దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి వంగవీటి రంగా ఘటనను గుర్తు చేస్తు..88 లో వంగవీటి రంగాని చంపారు..ముద్రగడ్డ పద్మనాభం కుటుంబ సభ్యులపైన కూడా దాడులకు పాల్పడ్డారు..ఓ సభలో అంబటి రాంబాబును చంపితే రూ.50 లక్షలు ఇస్తానని ప్రకటించారు..అంబటి రాంబాబు కు కులం లేదా,ఎవరూ రారనుకున్నారా..? అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వంలో ఎంతోమంది కాపులు అధికారంలో ఉన్నారన్నారు.విధాన పరంగా రాంబాబు మాట్లాడతారు..అయితే దాడులు చేస్తారా..? అంటూ ప్రశ్నించారు.
ముద్రగడ్డ పద్మనాభంపై చేసిన దాడులపై ఎవరూ మాట్లాడలేదే..? అంటూ ప్రశ్నించారు.అవినీతిలో అడ్డంగా దొరికిపోయి చంద్రబాబు జైలులో ఉంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి పరామర్శించారు..ఈ విషయాన్ని గమనించాలని ప్రజలను కోరుతున్నానన్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్ ప్రమాద ఘటన గురించి మాట్లాడుతు..రైలు ప్రమాద ఘటన వద్దకు ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శించనున్నారని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడినవారాకి మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
కాగా అంబటి రాంబాబు ఘటనపై వైసీపీ నేత డొక్కా మాణిక్యవర ప్రసాద్ మాట్లాడుతు..అంబటి రాంబాబుపై జరిగిన దాడి ని ఖండిస్తున్నామన్నారు.నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఏపీలో ప్రజలనుండి స్పందన లేదని ప్రక్క రాష్ట్రంలో మా మంత్రి పై దాడులు చేస్తారా..? అంటూ ప్రశ్నించారు. ఇటువంటివి దివాలా కోరు రాజకీయాలని అభివర్ణించారు. ఇటువంటి రాజకీయాలు మానుకోవాలని హెచ్చరిస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనలను వైసీపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అంటూ వార్నింగ్ ఇచ్చారు.