Gummanuru Jayaram
Jayaram criticized Lokesh : లోకేష్ పాదయాత్ర ఎక్కడ జరుగుతుందో ఆయనకే తెలియదని కార్మిక శాఖామంత్రి గుమ్మనూరు జయరాం విమర్శించారు. రాష్ట్రంలో జగన్ పాలనలో అభివృద్ధి తెలుసుకొని మాట్లాడాలన్నారు. అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. చంద్రబాబుకు తెలిసేది ఒక్కటే 40 సంవత్సరాల అనుభవం అన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా రాష్ట్రానికి చేసింది ఎమీ లేదని విమర్శించారు.
ఈ మేరకు శుక్రవారం ఆయన శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు వందశాతం అమలు చేసింది జగనన్న ఒక్కడేనని కొనియాడారు. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఇదేనని చెప్పారు. జగన్ ప్రబుత్వంపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ చెప్పే కల్లబొల్లి మాటలను వినే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని తెలిపారు.
Vijayashanti: అందుకే అక్కడి నుంచి వచ్చేశా.. బీజేపీలో హీట్ పుట్టిస్తున్న విజయశాంతి ట్వీట్..
టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు కలిసి 35 మార్కులు సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు. సీఎం జగన్ వంద మార్కులు సాధించేందుకు పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. ఒకడు తేలు కొరికిన దొంగ, మరొకడు కల్లు తాగిన దొంగలు లాగా ప్రతిపక్షాల వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు.
పాదయాత్రలో లోకేష్ కు మాట్లాడేందుకు రాక యాత్ర నుండి పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నారు. టీడీపీ లీడర్లు కొందరు లోకేష్ మొలతాడు పట్టుకొని పాదయాత్ర కొనసాగించేయత్నం చేస్తున్నారని వెల్లడించారు. లోకేష్, పవన్ కళ్యాణ్, మరో ముసలోడు ఎన్ని యాత్రలు చేసినా వైసీపీ విజయం ఆపలేరని తెలిపారు.