Minister Jogi Ramesh
Minister Jogi Ramesh: ఏపీ మంత్రి జోగి రమేష్ (Minister Jogi Ramesh) ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), టీడీపీ (TDP) నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పరామర్శకు వెళ్లి ఓట్లు అడుగుతున్న దుర్మార్గుడు చంద్రబాబు. బాధిత ఇంటికి వెళ్ళి మీటింగ్ పెట్టి మైక్‌లో ఓట్లు అడుగుతున్నాడు అని మంత్రి అన్నారు. అమర్నాథ్ హత్య చాలా ఘోరం. 24 గంటలలోపు ముగ్గురిని అరెస్టు చేశామని మంత్రి తెలిపారు. అమర్నాథ్ కుటుంబానికి అండగా ప్రభుత్వం ఉందని, రూ.10లక్షల నష్టపరిహారం అందించామని చెప్పారు. ఇంటి స్థలంతో పాటు, చిన్నారి చదువుకు అండగా ప్రభుత్వం ఉందని అన్నారు. ఈ వ్యవహారాన్ని టీడీపీ శవ రాజకీయాలు చెయ్యడానికి చూస్తుందని మంత్రి జోగి రమేష్ విమర్శించారు.
ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నా రెచ్చగొట్టడానికి చంద్రబాబు వెళ్ళాడని మంత్రి ఆరోపించారు. టీడీపీ హయాంలో వందలాది ఆడపిల్లల్ని పొట్టన పెట్టుకున్నారని, మహిళా అధికారులపై టీడీపీ ఎమ్మెల్యేలు దాడులు చేశారని, విజయవాడలో కాల్ మనీ పేరుతో ఆడవారి మానాలతో ఆడుకున్నారని మంత్రి విమర్శించారు. మీ దుర్మార్గాలను భరించలేక 2019 ఎన్నికల్లో మహిళలు మిమల్ని ఓడించారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు.