Minister Kannababu: నానికి కన్నబాబు కౌంటర్.. పాప్‌కార్న్‌లోనూ దోపిడే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిక్కెట్ల ధరల వ్యవహారం హీటెక్కింది.

Kanna Babu

Minister Kannababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిక్కెట్ల ధరల వ్యవహారం హీటెక్కింది.. సినిమా టిక్కెట్ల ధరలను భారీగా తగ్గించడంతో హీరో నాని లేటెస్ట్‌గా ఏపీ ప్రభుత్వంపై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. అయితే, నాని వ్యాఖ్యలపై మంత్రి కన్నబాబు కౌంటర్ ఇచ్చారు. హీరో నాని చేసిన వ్యాఖ్యలకు అర్థం ఏమిటో తనకు తెలియట్లేదని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలోని అనేక థియేటర్లలో టిక్కెట్ల రేట్లు సహా.. పార్కింగ్, తినే వస్తువులు.. ప్రతీదానిలో దోపిడీ జరుగుతుందని కన్నబాబు అన్నారు. టికెట్ ధరలను నియంత్రించడం ప్రభుత్వ బాధ్యతయని, అందుకే సినిమా టికెట్ ధరలు తగ్గించామని, టిక్కెట్ ధరలను తగ్గిస్తే, ప్రజలను అవమానించినట్లు ఎలా అవుతుందని హీరో నానిని ప్రశ్నించారు కన్నబాబు.

నాని కిరాణ షాపులను కూడా చులకనచేసి మాట్లాడారని, నానికి కిరాణ షాపులు అంటే ఎందుకంత చులకన అని ప్రశ్నించారు కన్నబాబు. థియేటర్ల యాజమాన్యాలు పాప్‌కార్న్ పేరుతో కూడా దోచుకుంటున్నాయని విమర్శించారు కన్నబాబు.