minister karumuri nageswara rao
minister karumuri nageswara rao : తణుకులో ఒక్క బెల్ట్ షాపు చూపించినా రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సవాల్ విసిరారు. వారాహి యాత్రలో పవన్ కల్యాన్ చేసే వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కారుమూరి మండిపడ్డారు. పవన్ చంద్రబాబు ఇచ్చిన స్ట్కిప్టు చదువుతు సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్నారని ఆయన మాట్లాడేవన్నీ అబద్దాలే అంటూ కొట్టిపారేశారు. వాలంటీర్లపై పవన్ చేసే వ్యాఖ్యలపై స్పందించని కారుమూరి ఒక్క వాలంటీర్ ను జైలుకు పంపగలిగినా ఉరి వేసుకుంటానని అన్నారు. తాను చేసిన ఈ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారని మరోసారి స్పష్టంచేశారు.
వారాహి యాత్రలో పవన్ వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ తో పాటు మంత్రులపై కూడా ఘాటు విమర్శలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా రెండో వారాహి యాత్రలో ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీని హీటెక్కించాయి. వాలంటీర్లల వల్ల..వారి కుటుంబాల నుంచి సేకరించిన డేటాల వల్ల ప్రజల భద్రతకు ప్రమాదం అని వ్యాఖ్యానించారు.దీంతో కారుమూరి మాట్లాడుతు..వాలంటీర్లపై విమర్శలు చేయటం దారుణమని వారు నేరాలు చేశారని నిరూపించి జైలుకు పంపితే తాను ఉరి వేసుకుంటానని అంటూ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారని మరోసారి స్పష్టం చేశారు.
పవన్ తన యాత్రలో భాగంగా మద్యపాన నిషేధం అని ప్రజలకు వాగ్ధానం చేసి వింత వింత బ్రాండ్ల పేరుతో ప్రజల ప్రాణాలు హరిస్తున్నారని..ఆడపడుచుల తాళి బొట్లు తెంపుతున్న సీఎం జగన్ అంటూ ఘాటు వ్యాఖ్యలతో వైసీపీ నేతలకు ఆగ్రహాన్ని రగిలిస్తున్నారు. దీంతో పవన్ యాత్రలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు పవన్ పై విరుచుకుపడుతున్నారు. ఇలా వపన్ యాత్ర ఏపీని హీటెక్కిస్తోంది. వచ్చే ఎన్నికల సమయం వరకు ఇది కొనసాగేలా ఉంది. ఇప్పుడే ఈ మాదిరిగా ఉంటే ఇక ఎన్నికల ప్రకటన వచ్చిన తరువాత ఇంకెలా ఉంటుందో వేచి చూడాలి.