Karumuri Nageswara Rao : నువ్వు ఒక్క వాలంటరీని అరెస్టు చేయించినా నేను ఉరి వేసుకుంటా : పవన్ కళ్యాణ్ కు మంత్రి కారుమూరి ఛాలెంజ్

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ఆంధ్రలో ఇల్లు లేదని, వారు హైదరాబాద్ లో ఉంటారని పేర్కొన్నారు. వాలంటరీకి జీతం కాదు ఇచ్చేది, గౌరవ వేతనం అని అన్నారు.

Karumuri Nageswara Rao : నువ్వు ఒక్క వాలంటరీని అరెస్టు చేయించినా నేను ఉరి వేసుకుంటా : పవన్ కళ్యాణ్ కు మంత్రి కారుమూరి ఛాలెంజ్

Karumuri Nageswara Rao (2)

Minister Karumuri Countered Pawan : పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. తణుకులో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఏమీ తెలియని మనిషి అన్నారు. పవన్ కళ్యాణ్ రూ.1000 కోట్లు సంపాదిస్తాను అని అంటున్నాడు అవి ఎక్కడ సంపాదిస్తాడో తనకు తెలియదన్నారు. మరి పవన్ ఇన్ కమ్ టాక్స్ ఎంత చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. టీడీఆర్ బాండ్స్ రూ.309 కోట్లు అవినీతి జరిగిందని అంటున్నాడు ఆ స్కీంలో ఎవరు ఉన్నారో పవన్ కళ్యాణ్ కి తెలుసా అని ప్రశ్నించారు.

టీడీపీ హయాంలో టీడీఆర్ బాండ్స్ అవినీతి జరిగిందన్నారు. తణుకులో డంపింగ్ యార్డ్ లేదని అంటున్నాడు..అయితే 8 ఏకరాల డంపిండ్ యార్డ్ ఉందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దేవస్థానాలకు గౌరవం దక్కిందన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు, అన్ని పథకాలు అమలు చేసింది జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. తిరుపతిని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి సింహంలా ముందుకు వస్తాడని తెలిపారు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు 32 మందిని చంపేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.

Pawan Kalyan : నాకు భయం లేదు… నీలాంటి ఎంతమంది జగన్ లు వచ్చినా ఎదుర్కొంటా : పవన్ కల్యాణ్

చంద్రబాబు హయాంలో హిందూ గుళ్ళు కుల్చేస్తే ఎందుకు అడగలేదని నిలదీశారు. “మీ పార్టీ ఏజెండా ఎంటని, నీకు సంస్కృతి ఉందా” అని పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. ఎర్రిపప్ప అన్నది తానేనని అది ఎవరిని అన్నానో తెలుసా.. టీడీపీ నేతను తాను ఏర్రిపప్పా అన్నాను దాన్ని గురించి మాట్లాడుతున్నావన్నారు. ఇప్పుడు అంటున్నా.. చంద్రబాబుని , పవన్ కళ్యాణ్ ని ఎర్రిపాప్ప అని తెలిపారు. చంద్రబాబు నీ తండ్రి, నీవు దత్తపుత్రుడివని పవన్ ను ఉద్దేశించి మాట్లాడారు.

చంద్రబాబు కోర్టు స్టే లు తెచ్చుకుని తిరుగుతున్నాడని విమర్శించారు. కాపు యువతను పవన్ కళ్యాణ్ చెడ గొడుతున్నాడని మండిపడ్డారు. వాలంటరీ వ్యవస్థను తిసివేస్తావా, నిర్వీర్యం చేసేస్తావా అని ప్రశ్నించారు. పసుపు కుంకుమ ద్వారా కోట్ల రూపాయలు దోచేస్తే ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. రేపు నువ్వు ముఖ్యమంత్రి అయితే ఈ పథకాలు అన్ని తీసేస్తావా అని అడిగారు. మంచిని గ్రహించు పవన్ కళ్యాణ్ అని అన్నారు. అర్చకులది తప్పు గ్రహించి ఆ మంత్రి చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.

YS Avinash Reddy : వివేకా హత్య కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు

దాచుకో, పెంచుకో, పంచుకో అనేది పవన్ కళ్యాణ్ నినాదమని విమర్శించారు. బెల్ట్ షాప్ లో ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క షాప్ కూడా లేదన్నారు. తణుకులో ఒక్క బెల్ట్ షాపునైనా చూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. పవన్ కళ్యాణ్ విగ్గు బాయ్, విగ్గు పెట్టుకుని సినిమాలు చేస్తాడని విమర్శించారు. పవన్ కళ్యాణ్ తాట తీస్తా, తోలు తీస్తా అంటే పిల్లలు చెడిపోతున్నారని పేర్కొన్నారు. మందు రేట్ పెంచి ఎక్కడ కావాలి అంటే అక్కడ పెడతాను అంటున్నాడు అని పేర్కొన్నారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ఆంధ్రలో ఇల్లు లేదని, వారు హైదరాబాద్ లో ఉంటారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నువ్వు ఒక్క వాలంటరీని అరెస్టు చేయిస్తే తాను తణుకు నరేంద్ర సెంటర్లో ఉరి వేసుకుంటాను అంటూ చాలెంజ్ చేశారు. వాలంటరీకి జీతం కాదు ఇచ్చేది, గౌరవ వేతనం అని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఏమి జరుగుతుందో తెలుసా అని అన్నారు. పేదవాడికి ఇల్లు ఇస్తే తప్పా.. పవన్ కల్యాణ్ పార్టీ సిద్ధాంతం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.