Pawan Kalyan : నాకు భయం లేదు… నీలాంటి ఎంతమంది జగన్ లు వచ్చినా ఎదుర్కొంటా : పవన్ కల్యాణ్

రాజ్యాంగ పీఠికలో మతాలకు సంబంధించిన విషయాలకు ప్రభుత్వాలు దూరంగా ఉండాలని రాసుందన్నారు. అర్చకులను వేలం వేయడాన్ని కోర్టులో సవాలు చేస్తామని చెప్పారు. దేవాలయాలను దుర్వినియోగం చేస్తున్నారని వెల్లడించారు.

Pawan Kalyan : నాకు భయం లేదు… నీలాంటి ఎంతమంది జగన్ లు వచ్చినా ఎదుర్కొంటా : పవన్ కల్యాణ్

Pawan Kalyan (5)

Pawan Kalyan Fire Jagan : సీఎం జగన్ కి తణుకు నుంచి ఒకటే చెప్తున్నా.. నువ్వు కొంపలు అంటిస్తావు…. జనసేన గుండెలు అంటిస్తుంది అని పేర్కొన్నారు. 32 మంది భవన నిర్మాణ కార్మికుల ఉసురు తీశావని ఫైర్ అయ్యారు. కార్మికుల డబ్బులు పక్కదారి పట్టించి వారి పొట్ట కొట్టావని మండిపడ్డారు. సగటు మనిషి కష్టాలు తనకు తెలుసన్నారు. మాట్లాడితే బటన్ నొక్కాను అంటాడు.. నొక్కని బటన్ల సంగతి ఏంటని ప్రశ్నించారు. ఇంటి పన్ను సగటున 600 పెంచారని, ఇసుక 10వేల నుంచి 40వేలు చేశారని పేర్కొన్నారు. 60 రూపాయలు ఉండే మద్యం 120 రూపాయలు చేసి మద్యం ప్రియుల కడుపు కొట్టారని తెలిపారు.

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శుక్రవారం నిర్వహించిన వారాహి సభలో పవన్ ప్రసంగించారు.  దేవరకొండ బాలగంగాధర తిలక్ తనకు స్ఫూర్తి అని తెలిపారు. రెండో విడత వారాహి యాత్ర తణుకు సభతో పూర్తవుతుందన్నారు. పవన్ క్షమాపణలతో సభను ప్రారంభించారు. జనసేన తణుకు ఇంఛార్జి విడివాడ రామచంద్ర రావుకి పవన్ బహిరంగంగా క్షమాపణ చెప్పారు. గత ఎన్నికల్లో వేరే వ్యక్తికి సీటు ఇచ్చినా… పార్టీలో ఉండి పని చేశారని పేర్కొన్నారు. సీటిచ్చిన వ్యక్తి వెళ్ళిపోయినా.. ఆయన మాత్రం పార్టీ కోసం పని చేస్తున్నారని కొనియాడారు.

YS Avinash Reddy : వివేకా హత్య కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు

మద్య నిషేధం అని చెప్పి లక్షా30వేల కోట్లు రూపాయలు దోచేశావని విమర్శించారు. అందుకేనా జగన్.. పరదాలు కట్టుకుని తిరుగుతున్నావని ఎద్దేవా చేశారు. రేట్లు పెంచి మొహం చూపించలేక హెలికాప్టర్లో తిరుగుతున్నాడని విమర్శించారు. ఏపీ టిడ్కో కార్పొరేషన్ నుంచి రూ. 9,159 కోట్లు అప్పు తెచ్చి బడ్జెట్ లో చూపించ లేదన్నారు. వీటితో ఎక్కడా పథకాలు ఇవ్వలేదన్నారు. తణుకులో టీడీఆర్ బాండ్ల పేరుతో 309కోట్ల రూపాయలు కొట్టేశారని ఆరోపించారు. ఇవన్నీ ఉంటే రేట్లు పెంచాల్సిన అవసరం లేదు కదా అని అన్నారు.

తణుకులో పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు అని చెప్పి… తక్కువ రేటుకు కొని ఎక్కువ ధర చూపించి రూ.50కోట్లు కొట్టేశారని విమర్శించారు. స్థలాల మెరక పేరుతో మరో రూ.50 కోట్లు కొట్టేశారని పేర్కొన్నారు. గ్రీన్ ఫీల్డ్ జోన్ లో స్థలం కొని…. తణుకు కార్పొరేషన్ కి అమ్మేశారని వెల్లడించారు. మన దగ్గర లంచం తీసుకునే అధికారులు.. రాజకీయ అవినీతిని ఆపాలన్నారు. వేల కోట్ల రూపాయలు దోచుకునే నాయకుల సంగతేంటని ప్రశ్నించారు. అవినీతి నాయకులు, జగన్ పై తామందరి పోరాటం అన్నారు. తణుకులో డంపింగ్ యార్డు లేదు… అయినా ఇక్కడ చెత్త పన్ను వేస్తారని పేర్కొన్నారు.

Dasoju Sravan Kumar : రేవంత్ రెడ్డి అభిమానులమంటూ ఫోన్ చేసి.. నాకు, నా కుటుంబ సభ్యులకు బెదిరింపులు : దాసోజ్ శ్రావణ్ కుమార్

ఆర్బీకేలు లేవు, సచివాలయాలు పూర్తి కాలేదని విమర్శించారు. రైతుకు కష్టం వచ్చి మొరపెట్టుకుంటే ఇక్కడ ఓ పెద్ద మనిషి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాడని తెలిపారు. మద్దతు ధర అడిగిన రైతులపై దువ్వలో కేసులు పెట్టించారని పేర్కొన్నారు. కాలువలు ఎలాగూ బాగు చేయలేవు…. కనీసం రోడ్లు అయినా వెయ్యి జగన్ అని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేవు… రూ.30 కోట్లతో ఎర్ర కాలువ బాగు చెయ్యి అని సూచించారు. రైతులు వేల ఎకరాల్లో పంట నష్ట పోతున్నారని పేర్కొన్నారు.

మద్యం మీద డబ్బులు వద్దన్న వ్యక్తి… ఇవాళ లక్ష కోట్ల రూపాయలు దోచేశాడని ఆరోపించారు. జగన్ కి హిస్టీరియా అనే రోగం ఉందన్నారు. అడ్డగోలుగా అబద్ధాలు చెప్పి…. సమర్ధించుకుంటున్నారని విమర్శించారు. దేవాలయాల్లో విగ్రహాలు పగలగొట్టినా, అంతర్వేదిలో రథం తగలబెడితే పట్టించుకోలేదని పేర్కొన్నారు. అన్నవరంలో పురోహితులను వేలం పాట పెట్టాడని, పురోహితులను వేలం పాట పెట్టడానికి జగన్ కు హక్కు ఉందా అని ప్రశ్నించారు. ఇదే పద్ధతిని క్రైస్తవ, ఇస్లాంలో కూడా అనుసరిస్తావా అని నిలదీశారు.

YS Sharmila : పేదలకు దక్కాల్సిన స్కీములన్నీ బీఆర్ఎస్ దొంగల పాలు : వైఎస్ షర్మిల

రాజ్యాంగ పీఠికలో మతాలకు సంబంధించిన విషయాలకు ప్రభుత్వాలు దూరంగా ఉండాలని రాసుందన్నారు. అర్చకులను వేలం వేయడాన్ని కోర్టులో సవాలు చేస్తామని చెప్పారు. దేవాలయాలను దుర్వినియోగం చేస్తున్నారని వెల్లడించారు. వైసీపీ నాయకులు హిందూ ధర్మాన్ని అగౌరవ పరుస్తున్నారని పేర్కొన్నారు. దేవాదాయ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలన్నారు. ఇస్లాం, క్రైస్తవ ఆస్తులను కాజేయగలవా అని ప్రశ్నించారు. ఇతర మతాలపై లేని పెత్తనం హిందూ మతానికి ఎందుకన్నారు. హిందూ ధర్మంతో పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని హెచ్చరించారు.

తన దేశంలో తాను బతకడానికి ట్యాక్స్ ఎందుకు కట్టాలని ప్రశ్నించారు. దోచుకోవడం జగన్ కు అలవాటని విమర్శించారు. అధికారులకు ట్యాక్స్ చెల్లించి, వెర్రిపప్పలకు కూడా ట్యాక్స్ చెల్లించాలంటే బాధగా ఉందన్నారు. 8వేల కోట్ల రూపాయల ప్రైవేటు ఆస్తులు దోచేశారని పేర్కొన్నారు. దోపిడీ తట్టుకోలేక పారిశ్రామిక వేత్తలు రాష్ట్రం నుంచి పారిపోతున్నారని తెలిపారు. వైజాగ్ లో హెల్త్ సెంటర్ ని లాగేసుకున్నారని పేర్కొన్నారు. మీరు నడుపుతున్న బైరైటిస్ గనులు ఎవరివి… దోచుకున్నవే కదా అని అన్నారు. వాలంటీర్లతో తన దిష్టి బొమ్మలు తగలబెట్టించావని మండిపడ్డారు. “నాకు భయం లేదు… నీలాంటి ఎంతమంది జగన్ లు వచ్చినా ఎదుర్కొంటాం” అని పేర్కొన్నారు.

Payyavula Keshav : సామాన్యుడికి ఇసుక దొరకడం లేదు.. కానీ, పక్క రాష్ట్రాలకు భారీగా అక్రమంగా తరలింపు : పయ్యావుల కేశవ్

మద్యం మత్తులో 52 వేల మంది మహిళలపై దాడులు చేశారు… దానికి జగనే కారణమని ఆరోపించారు. రకరకాల బ్రాండ్ల పేరుతో నాసిరకం మద్యం తెచ్చావని విమర్శించారు. గతంలో లక్ష బెల్టు షాపులు ఉంటే… దాన్ని 3లక్షలు చేశావని పేర్కొన్నారు. జగన్ దిశ యాప్ అంటారు… కానీ, ఆయన పాలనలో 3,372 మంది ఆడబిడ్డలు అత్యాచారాలకు గురయ్యారని పేర్కొన్నారు. తిరిగి వచ్చేశారు అంటున్నారు… వారు ఏ పరిస్థితిలో వచ్చారో సమీక్ష చేశావా అని నిలదీశారు. మహిళా కమిషన్ ఏం చేస్తుంది…. మహిళా హోం మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కడప ప్రొద్దుటూరు లో యువతిపై పలుమార్లు అత్యాచారం జరిగితే కబుర్లు చెబుతారని విమర్శించారు.

దేశంలో అత్యధికంగా గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న రాష్ట్రం ఏపీనేనని తెలిపారు. లక్ష మంది మహిళలు వాలంటీర్లలో ఉన్నారని పేర్కొన్నారు. వాలంటీర్ల పొట్ట కొట్టను… వారితో కన్నీళ్లు పెట్టించను…. వారి మంచి కోసం చెబుతున్నానని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఐఏఎస్ అధికారులు ఏది చెప్తే అది చేసి జైలు పాలయ్యారని తెలిపారు. వాలంటీర్లతో విలువైన సమాచారం సేకరించి తప్పు చేయిస్తున్నారని వెల్లడించారు. తాను మాట్లాడేది వాలంటీర్లను రక్షించడానికి.. మీరు చేసేది 2022 డిజిటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కిందికి వస్తుందన్నారు.