Minister Kodali Nani Fires On Chandrababu Naidu
Kodali Nani: కరోనా వ్యాక్సిన్ విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విఫలమైందనే చంద్రబాబు చేస్తున్న విమర్శలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ మంత్రి కోడాలి నాని. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయలేక చంద్రబాబు, టీడీపీ భజనపరులు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి వద్దంటే ఎన్నికలు పెట్టిన నిమ్మగడ్డ రమేష్ కుమార్, పెట్టించిన చంద్రబాబే కారణమని అన్నారు.
ప్రభుత్వంపై విషం చిమ్మడమే పనిగా చంద్రబాబు పనిచేస్తున్నారని, వ్యాక్సిన్ తెప్పించుకుని చంద్రబాబు, ఆయన కుమారుడితో పాటు నలుగురు కుటుంబ సభ్యులు వేసుకున్నారని అన్నారు. ఎన్టీఆర్ కుటుంబసభ్యులకు కానీ, రామ్మూర్తి నాయుడి కుటుంబ సభ్యులకు కానీ వేయించలేదని అన్నారు.
కర్నూలులో కొత్త వేరియంట్ వచ్చిందని చంద్రబాబు చెబుతున్నారని, కర్నూలులో వైరస్ రాలేదని, చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో వచ్చిందని, దానిపేరు CBN420 అని అన్నారు. రాష్ట్రంలో ఎక్కువ మందికి కరోనా రావాలనేది చంద్రబాబు, టీడీపీ నేతల ఉద్దేశ్యమని కొడాలి నాని అన్నారు.
టీడీపీ నేత అచ్చెన్నాయుడిని దున్నపోతుగా, ఆంబోతుగా అభివర్ణించిన మంత్రి నాని, అచ్చెన్నాయుడికి మనుషుల ఆస్పత్రిలో కాకుండా పశువుల ఆసుపత్రిలో చికిత్స జరగాలని, మనుషులకు చికిత్స చేసే ఆస్పత్రిలో వైద్యం అందించడం వల్లే అచ్చెన్నాయుడి వ్యాధి తగ్గలేదన్నారు.