Kodali Nani Hot Comments : జగన్ బతికుండగా.. సీఎం సీటుని టచ్ చేసే వాడు లేడు-కొడాలి నాని

చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎన్ని జన్మలు ఎత్తినా.. (Kodali Nani Hot Comments)

Kodali Nani Hot Comments : జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న మరణాలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య తారస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. వారంతా కల్తీసారా తాగి చనిపోయారని, అవి ప్రభుత్వ హత్యలేనని టీడీపీ ఆరోపిస్తోంది. దీనికి వైసీపీ కూడా ధీటుగానే బదులిస్తోంది. టీడీపీ ఆరోపణల్లో నిజం లేదని, అవన్నీ సహజ మరణాలేనని వైసీపీ ఎదురుదాడికి దిగింది. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరిగారాయన.(Kodali Nani Hot Comments)

TDP Leaders: కల్తీసారా మరణాల పై అధికార పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి: టీడీపీ నేతలు

చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద విషం కక్కుతున్నారని కొడాలి నాని ధ్వజమెత్తారు. జంగారెడ్డిగూడెంలో 25 మంది నాటు సారా తాగి మరణించారు అంటూ.. చంద్రబాబు.. శవాల మీద చిల్లర ఏరుకునే ప్రయత్నం చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. అనారోగ్యంతో చనిపోయిన వారి బూడిద కూడా మిగలలేదన్నారు. చంద్రబాబు అవినీతితో సంపాదించిన డబ్బు లక్ష రూపాయలు ఇస్తానని అంటున్నారు, ముఖ్యమంత్రి అయితే రూ.25 లక్షలు ఇస్తానని చెబుతున్నారు అని ఫైర్ అయ్యారు. 3వ తేదీన నుండి చనిపోతే, కల్తీ మద్యం తాగి చనిపోయారని పోలీస్ కేసు పెట్టాలి కదా అని ప్రశ్నించారు. కానీ, ఎవరూ ఫిర్యాదులు చేయలేదన్నారు మంత్రి కొడాలి నాని. కనీసం పోస్టుమార్టం కూడా చేయలేదన్నారు.(Kodali Nani Hot Comments)

Pawan Kalyan: జగన్ పాలనలో జరిగింది.. జరిగేది ఇదే..! జనసేన ఆవిర్భావ సభలో విరుచుకుపడిన పవన్

తన మన అన్న భేదం లేని వ్యక్తి సీఎం జగన్ అని మంత్రి ప్రశంసించారు. చంద్రబాబు ఎన్ని జన్మలు ఎత్తినా ప్రజలు నమ్మరని అన్నారు. తన భార్యను రోడ్డెక్కించి అధికారం పొందాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న కౌరవ సభలో అడుగుపెట్టనని జగన్ అన్నారని గుర్తు చేసిన మంత్రి కొడాలి నాని.. 43 మంది శాసన సభ్యులం.. జగన్ ఆదేశాలతో అసెంబ్లీకి రాలేదన్నారు.

Lokesh On Liquor Deaths : శవ రాజకీయాలకు జగన్ బ్రాoడ్ అంబాసిడర్-నారా లోకేష్

వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డిలను వారికి మద్దతిచ్చిన చంద్రబాబును కాపాడుకునేందుకే ఆ కేసును జగన్ కుటుంబ సభ్యుల మీద తోశారని ఆరోపించారు. తండ్రి, తాత సీఎంగా చేసినా మంగళగిరిలో ఓడిన చవట లోకేష్ అని మంత్రి కొడాలి నాని అన్నారు.

కమ్మలు.. జగన్ కు వర్గ శత్రువు అని పవన్ కళ్యాణ్ అంటాడు, కాపులు చంద్రబాబును సీఎం చేయాలంటాడు అని కొడాలి నాని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో జగన్ కు వ్యతిరేకంగా 160 సీట్లలో పోటీ చేసే ఒక్క మగాడు ఉన్నా నేను రాజకీయాలు వదిలేస్తా అని కొడాలి నాని చాలెంజ్ చేశారు. ఏ రాజకీయ పార్టీలో అయినా ఈ రాష్ట్రంలో 160 సీట్లలో పోటీ చేయగల మగాడు ఉన్నాడా? అని ప్రశ్నించారు. జగన్ బతికుండగా.. సీఎం సీట్ ను టచ్ చేసేవాడు లేడని మంత్రి కొడాలి నాని అన్నారు.(Kodali Nani)

రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ సీట్ల‌లో సొంత అభ్య‌ర్థుల‌తో పోటీ చేసే స‌త్తా ఒక్క వైసీపీకి మిన‌హా మ‌రే ఇత‌ర పార్టీకి లేద‌ని మంత్రి కొడాలి నాని చెప్పారు. మొత్తం సీట్లు 175 అయితే అందులో 160 సీట్ల‌కు కూడా సొంతంగా పోటీ చేసే స‌త్తా ఏ పార్టీకి కూడా లేద‌ని తేల్చారు. ”రాష్ట్రంలో ఒకేసారి 160 సీట్ల‌కు పోటీ చేసే స‌త్తా ఏ ప్ర‌తిప‌క్ష‌ పార్టీకి లేదు. గుంపులుగా పందుల త‌ర‌హాలో అంతా క‌లిసి 175 సీట్లు పంచుకోవాల్సిందే. 175 సీట్ల‌లో ఒకేసారి పోటీ చేసే స‌త్తా ఒక్క వైసీపీకి మాత్ర‌మే ఉంది” అని కొడాలి నాని అన్నారు.

జంగారెడ్డిగూడెం మ‌ర‌ణాల‌పై విప‌క్షాలు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. బాధిత గ్రామ ప్ర‌జ‌ల‌ను విప‌క్షాలు త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయన్న ఆయ‌న‌.. సాధార‌ణ మ‌ర‌ణాల‌ను మ‌ద్యం మ‌ర‌ణాలుగా చిత్రీక‌రిస్తున్నాయ‌ని ఆరోపించారు. సీఎం జ‌గ‌న్‌పై బుర‌ద‌చ‌ల్లాల‌ని 420 బ్యాచ్ య‌త్నిస్తోందని ఆరోపించిన ఆయ‌న‌.. ప్ర‌భుత్వాన్ని అల్ల‌రి చేయాల‌ని చూస్తే.. చంద్ర‌బాబు తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటార‌ని హెచ్చ‌రించారు.

ట్రెండింగ్ వార్తలు