TDP Leaders: కల్తీసారా మరణాల పై అధికార పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి: టీడీపీ నేతలు

జంగారెడ్డి గూడెంలో చోటుచేసుకున్న కల్తీ సారా మరణాలపై సీఎం జగన్ సైతం ఆ మరణాలు సహజ మరణాలంటూ అసెంబ్లీలో ప్రకటించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

TDP Leaders: కల్తీసారా మరణాల పై అధికార పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి: టీడీపీ నేతలు

Tdp Leaders

TDP Leaders: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో చోటుచేసుకున్న కల్తీ సారా మరణాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ లో వాడివేడి చర్చ జరుగుతుంది. కల్తీ సారా మరణాలపై రాష్ట్ర ప్రభుత్వమే భాద్యత వహించాలంటూ ప్రతిపక్ష నేతలు పట్టుబడుతుంటే.. అధికార పార్టీ నేతలు మాత్రం అవి సహజ మరణాలంటూ చెప్పుకొస్తున్నారు. చివరకు సీఎం జగన్ సైతం ఆ మరణాలు సహజ మరణాలంటూ అసెంబ్లీలో ప్రకటించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కల్తీసారా మరణాలపై ప్రభుత్వం వెల్లడిస్తున్న వివరాలపై టీడీపీ నేతలు మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద స్పందించారు.

Also read: Kurasala Kannababu: చంద్రబాబు కోసం పార్టీ పెట్టిన వ్యక్తి పవన్: మంత్రి కురసాల కన్నబాబు

ఈసందర్భంగా ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ.. కల్తీసారా మరణాల పై ముఖ్యమంత్రి తెప్పించిన నివేదికను సభలో ఎందుకు టేబుల్ చేయలేదని ప్రశ్నించారు. అధికారపార్టీ నేతల్లోనే జంగారెడ్డి ఘటన పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అశోక్ బాబు అన్నారు. కల్తీ సారా మరణాలపై జంగారెడ్డి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైతే, అసలక్కడ సారా అమ్మకాలే లేవంటూ ప్రభుత్వం చెప్పడం విడ్డురంగా ఉందని అశోక్ బాబు అన్నారు. ఈఘటనపై మండలిలో చర్చకు ధైర్యం లేకనే ప్రభుత్వం పారిపోయిందని ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. రాష్ట్రంలో అక్రమ మద్యం వ్యాపారంలో వైకాపా నేతలు రాజ్యమేలుతున్నారని.. వైకాపా నేతల అక్రమ సారా వ్యాపారం పై తెదేపా ఆందోళన కొనసాగుతుందని అశోక్ బాబు పేర్కొన్నారు.

Also read: Somu Veerraju: పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన “బీజేపీ రోడ్ మ్యాప్”పై స్పందించిన సోము వీర్రాజు

ఇదే అంశంపై ఎమ్మెల్సీ బచ్చుల అర్జనుడు మాట్లాడుతూ 26 మంది మరణాల పట్ల ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరణాలపై భాద్యత వహించకుండా వైసీపీ ప్రభుత్వం శాసనమండలి నుంచి పారిపోయిందని అర్జునుడు ఎద్దేవా చేశారు. ఒకే ప్రాంతంలో 26 మంది పురుషులు చనిపోవడం ఎలా సహజమరణాలవుతాయని ప్రశ్నించిన అర్జునుడు..తన తండ్రిది కూడా సహజ మరణమే అనేలా జగన్ వైఖరి ఉందంటూ ఘాటు విమర్శలు చేశారు. కల్తీసారాతో ప్రజల ప్రాణాలు పోతుంటే.. అసెంబ్లీలో సీఎం జగన్ సగటు జనన-మరణాల లెక్కలు చెప్పటం దుర్మార్గమని అర్జునుడు అన్నారు.

Also read: Sangam Dairy : సంగం డైరీ చైర్మనే ట్రస్ట్ వ్యవహారాలు చూసుకుంటారు-ధూళిపాళ నరేంద్ర