Sangam Dairy : సంగం డైరీ చైర్మనే ట్రస్ట్ వ్యవహారాలు చూసుకుంటారు-ధూళిపాళ నరేంద్ర

సంగం డైరీ చైర్మన్‌గా ఇక నుంచి ఎవరు ఉంటారో వారే డీవీసీ(ధూళిపాళ వీరయ్యచౌదరి)ట్రస్ట్ బాధ్యతలు కూడా చూసుకుంటారని టీడీపీ నాయకుడు ధూళిపాళ నరేంద్ర చెప్పారు. 

Sangam Dairy : సంగం డైరీ చైర్మనే ట్రస్ట్ వ్యవహారాలు చూసుకుంటారు-ధూళిపాళ నరేంద్ర

Dhulipala Narendra

Updated On : March 15, 2022 / 1:41 PM IST

Sangam Dairy :  సంగం డైరీ చైర్మన్‌గా ఇక నుంచి ఎవరు ఉంటారో వారే డీవీసీ(ధూళిపాళ వీరయ్యచౌదరి)ట్రస్ట్ బాధ్యతలు కూడా చూసుకుంటారని టీడీపీ నాయకుడు ధూళిపాళ నరేంద్ర చెప్పారు.  ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ నాపై విమర్శలు చేస్తున్నారు.  ట్రస్టు ఆస్తులు మేం కాజేసినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ట్రస్టు కార్యకలాపాలు సంగం డెయిరీ పాలకవర్గం నిర్వహిస్తోందని.. ధూళిపాళ్ల నరేంద్రగా నేను ట్రస్టు విషయాల్లో ఉండనని ఆయన తేల్చి చెప్పారు. సంగం డెయిరీ చైర్మన్ ఎవరు ఉంటే వాళ్లకే అధికారం ఇస్తూ నిబంధనల్లో మార్పు చేసినట్లు నరేంద్ర వివరించారు.

డెయిరీ లో పనిచేసి వెళ్లిన వారే ఇప్పుడు పిటిషన్లు వేసి ట్రస్టుని వివాదాల్లోకి లాగారని ఆయన తెలిపారు. ఈ చెట్టు నీడలో పెరిగిన వారే ఇలా చేయటం మాకు బాధగా ఉంది…పిటిషన్ లు వేసేందుకు కొంత మంది వెనక ఉండి ప్రోత్సస్తున్నారని నరేంద్ర వివరించారు.

సొంత పార్టీ వారైనా, ఇతర పార్టీల వారైనా రాజకీయంగా తేల్చుకుంటానని ఆయన పేర్కోన్నారు. ఏవరైనా నాతో తేల్చుకోండి..ట్రస్ట్ తో రాజకీయాలు వద్దని ఆయన హితవు పలికారు. సంగం డైయిరీ మీద ఆధారపడి ఎంతో మంది జీవిస్తున్నారని… ఏసీబీ అధికారులు నేను అక్రమాలకు పాల్పడినట్లు ఒక్క ఆధారం చూపలేకపోయారని చెప్పారు. టన్నుల కొద్దీ కాగితాలు చూసినా నేను ఒక్క తప్పు చేశానని అధికారులు తేల్చలేకపోయినట్లు నరేంద్ర తెలిపారు.