Kottu Satyanarayana : కృష్ణలంక కార్పొరేటర్‌కు క్లాస్ పీకిన మంత్రి కొట్టు సత్యనారాయణ, పోలీసులపై ఆగ్రహం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై దేవాదయ ధర్మాదయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. కృష్ణలంక కార్పోరేటర్ రామిరెడ్డికి క్లాస్ పీకారు. మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

minister kottu satyanarayana

Minister Kottu Satyanarayana : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై దేవాదయ ధర్మాదయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. కృష్ణలంక కార్పొరేటర్ రామిరెడ్డికి క్లాస్ పీకారు. మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. దుర్గగుడి వద్ద డ్యూటీలు చేస్తున్న పోలీసులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని..ఇంద్రకీలాద్రిపై అజిమాయిషి చేయాలని చూస్తున్నారు అంటూ మండిపడ్డారు.

తన సొంత డబ్బులతో పోలీసులకు కూడా VIP టికెట్లు కొనిచ్చినా VVIP రూట్ లో తమకు కావాల్సిన వారిని తీసుకెళుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం అన్నదాన కేంద్రంలో భోజనాలు ఆపేయమని ఎవరో పోలీసు అధికారి చెప్పారని ఆపేశారు..అసలు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి పోలీసులు ఎవరు అంటూ మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ చూసుకోవడానికి మాత్రమే పోలీసులు ఉన్నది కానీ తమ ఇష్టానుసారంగా చేస్తామంటే కుదరదన్నారు. కొందరు అధికారులు చేస్తున్న అతిపై ఇప్పుడే సీపీకి నోట్ రాస్తున్నానని తెలిపారు. రెవిన్యు అధికారులు, సిబ్బంది కూడా ఇష్టానుసారంగా VVIP రూట్ లో దర్శనానికి తీసుకెళుతున్నారని..ఇటువంటి ఘటనలు ఇకపై కుదరవన్నారు. ఈ అంశంపై మద్యాహ్నం తరువాత సీపీ, కలెక్టర్ తో సమావేశం పెడతానని తెలిపారు.

Dharmavaram: పగలు గుడ్ మార్నింగ్.. రాత్రి దాడులు: కేతిరెడ్డిపై జనసేన నేత ఫైర్

పోలీసులు, రెవిన్యూ అధికారులు VVIP ఎంట్రీ గేట్ నుండి దర్శనానికి ఇష్టానుసారంగా తీసుకెళుతున్నారని భక్తులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై దృష్టి పెట్టిన మంత్రి కృష్ణలంక కార్పొరేటర్ రామిరెడ్డికి క్లాస్ పీకారు. చినరాజ గోపురం VVIP గేట్ వద్ద పరిస్దితిని పరిశీలిస్తున్న సమయంలో తమ బంధువులను తీసుకొని గేటులో నుండి వెళుతున్న కార్పొరేటర్ రామిరెడ్డిని అడ్డుకుని రూ. 500 క్యూలైన్ లో వెళ్లాలని ఆదేశించారు. తప్పు చేయకుండా అడ్డుకోవాల్సిన మనమే తప్పు చేస్తామంటే ఎలా ..? అంటూ మీడియా పాయింట్లో కార్పొరేటర్ ను పిలిచి క్లాస్ పీకారు. రూల్ ఎవరికైన రూలే అన్నారు. రూ.500/- టికెట్స్ ఉన్నాయని పంపమని అడిగినా మంత్రి వినలేదు. రూ. 500/- క్యూలైన్ లోనే కార్పొరేటర్ బంధువులను పంపాలని ఆదేశించారు. అంతమందిలో మంత్రి ఘాటుగా హెచ్చరించడంతో రూ.500/- క్యూలో దర్శనానికి వెళ్లిపోయాడు కార్పొరేటర్ రామిరెడ్డి.