Kottu Satyanarayana
Kottu Satyanarayana – YCP: టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడి (Chandrababu Naidu)పై హాట్ కామెంట్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. మోసం, అవినీతి, అక్రమాల నుంచి పుట్టిన రాజకీయ నాయకుడు చంద్రబాబు అని అన్నారు. దేవుడితో పరాచకాలు ఆడితే చంద్రబాబు నాయుడు ఇంకా పాతాళానికి పోతారని, ఆయన జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
దేవాదాయ శాఖ చేస్తున్న పూజలు, యజ్ఞాలు సీఎం జగన్మోహన్ రెడ్డికి కోర్టు కేసుల్లో మేలు జరగడానికే అన్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. మొన్న రాజమహేంద్ర వరంలో టీడీపీ నిర్వహించిన మహానాడులో గాలి, దుమ్ము వచ్చి ప్రకృతి వారి మీద కన్నెర్ర చేసిందని చెప్పారు.
ఏ మాత్రం నైతిక విలువలు లేని వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. నూతనంగా ప్రవేశపెట్టిన ధార్మిక పరిషత్, ఆగమ సలహా మండలి సలహాలతో గొప్ప యజ్ఞాన్ని నిర్వహించామని తెలిపారు.
చెప్పులతో ముఖ్యమంత్రి హోమానికి వెళ్లారంటున్నారని, చంద్రబాబుకు కళ్లు ఉన్నాయా? పోయాయా? అని నిలదీశారు. జరిగిన యాగాలు గురించి భగవంతుడు మెచ్చి, యాగ ఫలాలు మన రాష్ట్రానికి అందుతున్నాయని తెలిపారు.