Nara Lokesh : ఓర్వలేకపోతున్నారా జగన్‌? వైఎస్ జగన్‌కు మంత్రి నారా లోకేశ్ కౌంటర్..

Nara Lokesh : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు.

Nara Lokesh YS Jagan

Nara Lokesh : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మంచి రుచికరమైన భోజనం పెడుతుంటే జగన్ ఓవర్లేక పోతున్నారంటూ నారా లోకేశ్ ధ్వజమెత్తారు.

Also Read : Chigurugunta Gold Mines : జొన్నగిరి తరువాత ఏపీలో మరో బంగారు గని.. 25ఏళ్ల తరువాత మళ్లీ జీవం.. 8.5టన్నుల బంగారం

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండే దాదాపు 85,000 మంది అక్కాచెల్లెళ్ల జీవితాలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. మధ్యాహ్న భోజనం వండేవారిలో చాలామంది 20ఏళ్లకు పైగా పనిచేస్తున్నారు. ఇప్పుడు, “స్మార్ట్ కిచెన్‌ల” ముసుగులో ఈ మహిళలను గాలికి వదిలేసి, తన పార్టీ కార్యకర్తల కడుపు నింపడానికి సీఎం చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగా, గత రెండు నెలలుగా వారికి చెల్లించాల్సిన జీతాలను నిలిపివేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి వైసీపీ అండగా నిలుస్తుందన్న జగన్.. ఇప్పటికే నిలిపివేసిన వారి వేతనాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, వాగ్దానం చేసిన విధంగా వారి వేతనాలను పెంచాలని కూటమి ప్రభుత్వాన్ని జగన్ డిమాండ్ చేశారు. తాజాగా.. జగన్ వ్యాఖ్యలను ఖండిస్తూ మంత్రి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

ప్రభుత్వ పాఠశాలల్లోని స్మార్ట్ కిచెన్‌ ల ద్వారా విద్యార్థులకు రుచికరమైన, శుభ్రమైన భోజనాన్ని అందిస్తుంటే జగన్ మోహన్ రెడ్డి ఓర్వలేక పోతున్నారంటూ లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే ఉన్న సిబ్బందితోపాటు, ఈ స్మార్ట్ కిచెన్‌లు మహిళలకు, పేదలకు అదనపు ఉపాధిని కల్పిస్తుంటే జగన్ తట్టుకోలేక పోతున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఐదు స్మార్ట్ కిచెన్‌లను పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టాం. ఈ పాఠశాలల్లో పనిచేస్తున్న 233 మంది వంట సహాయకులు యధావిధిగా తమ విధులను నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో ఏర్పాటు చేయనున్న మరో 33 స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేసి.. 392 మందికి ఉపాధి కల్పించబోతున్నామని పేర్కొన్నారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంటే జగన్ కు బాధ ఎందుకని లోకేశ్ ప్రశ్నించారు. పేదలు బాగుపడితే చూడలేకపోతున్నారంటూ నిలదీశారు.