ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. సభలో నవ్వులు పూయించిన పవన్ కల్యాణ్..

అయ్యన్న పాత్రుడు చాలా సీనియర్ నేత. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం కలిగిన నేత సభాపతి స్థానంలో కూర్చోవటం చాలా సంతోషంగా ఉందని పవన్ అన్నారు

Minister Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ 16వ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయన్ను సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సభాపతి స్థానంలో కూర్చుండబెట్టారు. అనంతరం సభాపతిని ఉద్దేశిస్తూ సీఎం చంద్రబాబు మాట్లాడారు.. అయ్యన్న పాత్రుడుతో తనకున్న అనుబంధాన్ని తెలియజేశారు. ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం దెబ్బతీసిందని, 23 మంది గెలిచి అసెంబ్లీకి వస్తే చాలా ఇబ్బంది పెట్టారని గుర్తు చేసుకున్నారు. కానీ, ఇంకనుంచి సభ గౌరవ ప్రదంగా జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

Also Read : ఏపీ శాసనసభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు.. ఏకగ్రీవ ఎన్నిక

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. అయ్యన్న పాత్రుడు చాలా సీనియర్ నేత. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం కలిగిన నేత సభాపతి స్థానంలో కూర్చోవటం చాలా సంతోషంగా ఉందని పవన్ అన్నారు. రాజకీయ జీవనంలో ఇన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడివేడిని చూశారు.. మీకు కోపం వస్తే.. రుషికొండను చెక్కినట్లు పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండుకొట్టేస్తారు.. ఇకపై మీకు తిట్టే అవకాశం లేకపోవచ్చు.. కానీ, ఇక సభలో ఎవరు తిడుతున్నా వారిని నియంత్రించే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది.. మీరే కంట్రోల్ చేయాలంటూ పవన్ అనడంతో.. సభలో నవ్వులు పూశాయి. పవన్ తన స్పీచ్ లో హాస్యాన్ని జోడించి తనదైన శైలిలో అయ్యన్న పాత్రుడుపై పొగడ్తల వర్షం కురిపించడంతో సభలో సభ్యులు కడుపుబ్బా నవ్వారు. ఇన్నాళ్లు మీలోని ఆవేశాన్ని చూశాం.. ఇకనుంచి మీలో హూందాతనం చూస్తామని పవన్ అన్నారు.

Also Read : వైసీపీ కార్యాలయం కూల్చివేతపై స్పందించిన జగన్ .. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు

పవన్ తన స్పీచ్ లో .. గత ప్రభుత్వంలో జరిగిన సభ తీరును ఎండగడుతూ.. ప్రస్తుతం వైసీపీ సభ్యులు సభలో లేకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. గత ఐదేళ్ల కాలంలో సభలో వ్యక్తిగత దూషణలకే పరిమితం అయ్యారు. అందుకే వాళ్లు 11 సీట్లకే పరిమితం అయ్యారు. ఈ రోజు సభలోకూడా లేరు.. ధైర్యం లేదు వాళ్లకి.. విజయాన్ని తీసుకోగలిగారు కానీ, ఓటమిని కూడా తీసుకొనే ధైర్యం లేక వారు సభలో లేకుండా పోయారంటూ పవన్ అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు