MAA Elections : ‘మా’ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి పేర్ని నాని
అక్టోబర్ 10 మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఎన్నికల బరిలో నిలిచిన వారు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికలపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు.
- kunduru Vinod
- Published On : October 4, 2021 / 03:47 PM IST
Maa Elections
MAA Elections : మా ఎన్నికలు రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. ఎప్పుడు లేని విధంగా ఈ సారి ‘మా’ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇప్పటికే నామినేషన్‌ల పర్వం ముగిసింది. ఇక ఎన్నికలు కూడా దగ్గర పడుతుండడంతో రెండు ప్యానల్ సభ్యులు ప్రచారంలో బిజీ అయిపోయారు. ఇక ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు ఆదివారం బాలకృష్ణను కలిశారు. ప్రకాష్ రాజు కూడా సినీ పెద్దలతో భేటీ అవుతున్నారు.
Read More : MAA Elections : తెలంగాణ నినాదంతో ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్న సీనియర్ నటుడు..
ఇక ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రి పేర్ని నాని ఈ ఎన్నికల పై స్పందించారు. చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి జరుగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ ఎన్నికల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. కాగా అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read More : MAA Elections 2021 : నామినేషన్ వెనక్కి తీసుకున్న సీవీఎల్
