MAA Elections : తెలంగాణ నినాదంతో ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్న సీనియర్ నటుడు..

 'మా' ఎలక్షన్స్ రోజు రోజుకి ఉత్కంఠగా మారుతున్నాయి. ఇప్పటికే మంచు విష్ణు ప్యానెల్, ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఒకరి పై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. జనరల్ ఎలక్షన్స్ ని

MAA Elections : తెలంగాణ నినాదంతో ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్న సీనియర్ నటుడు..

Cvl

MAA Elections :  ‘మా’ ఎలక్షన్స్ రోజు రోజుకి ఉత్కంఠగా మారుతున్నాయి. ఇప్పటికే మంచు విష్ణు ప్యానెల్, ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఒకరి పై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. జనరల్ ఎలక్షన్స్ ని మించి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ‘మా’ ఎలక్షన్స్ బాగా హీట్ ఎక్కాయి. అగ్నికి ఆజ్యం పోసినట్టు తాజాగా మరో సీనియర్ నటుడు ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను అని ప్రకటించాడు.

తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో సంవత్సరాల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్నమైన పాత్రలు పోషించి అందర్నీ మెప్పిస్తున్న నటుడు సీవీఎల్‌ నరసింహారావు. ఈయన ఈ సారి ‘మా’ అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఈ ఎలక్షన్స్ లో పోటీ చేయబోతున్నట్టు వెల్లడించారు. అయితే కొత్తగా ‘మా’లో తెలంగాణ నినాదంతో పోటీ చేస్తూ అందర్నీ షాక్ కి గురి చేశారు. అందరూ రాష్ట్రాలు విడిపోయినా తెలుగు సినిమా ఒకటే అని ఇన్నాళ్లు కలిసే ఉన్నారు. తాజాగా నటుడు సీవీఎల్‌ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ ‘మా’ అసోసియేషన్‌ను కూడా రెండుగా విభజించాలని ఆంధ్ర, తెలంగాణ అసోసియేషన్లుగా ఏర్పాటు చేయాలని అన్నారు. రెండు ప్రాంతాల చిన్న కళాకారుల సంక్షేమమే లక్ష్యంగా నేను పని చేస్తానని చెప్తూ తన మ్యానిఫెస్టోని విడుదల చేశారు.

Tapsee : అది నిజంగా ఉందా?? దాని గురించి తెలిశాకే సినిమా ఒప్పుకున్నా..

ఈ మానిఫెస్టో ప్రకారం 2011లో మనం పాస్ చేసుకున్న రిజల్యూషన్ ని పర్ఫెక్ట్ గా అమలు చేస్తానని, ఇది కనుక అమలు అయితే ఆర్టిస్టుల అందరికీ అవకాశాలు వస్తాయని తెలిపారు. ఈ రిజల్యూషన్ పాస్ చేసినప్పుడే 50మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చెయ్యాలి అనుకున్నాము అది చేస్తానని అన్నారు. అంతే కాక ప్రతి ‘మా’ సభ్యుడికి హెల్త్ ఇన్సూరెన్స్ 3లక్షల రూపాయలు సంవత్సరానికి వుండేలా చూస్తాము అని ఆ అమౌంట్ ‘మా’నే కడుతుంది అని తెలిపారు. నేను గెలిస్తే ఇది వచ్చే జనవరి నుంచే అమలు చేస్తాను అని అన్నారు.

ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో ‘మా’ మెంబర్ కి అసోసియేట్ మెంబర్ షిప్ ఇప్పిస్తాను అని, ప్రస్తుతం ఇస్తున్న 6వేలు పెన్షన్ ని 10వేలు చేస్తానని, ఆడవాళ్ళకు ఉపయోగపడే ఆసరాని 20 ఏళ్లు క్రితం పెట్టిందని దాన్ని మళ్ళీ రివైవ్ చేస్తాను అని,
ఎవరైనా ‘మా’ సభ్యుడు ఆకలి భాధలు పడితే అతను కాల్ చేసిన రెండు గంటలలో అతని ఇంటికి నెల రోజుల సరిపడా సరుకులు పంపిస్తాము అని తెలిపారు. రెండు మూడు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతానని వివరించారు. ఈ నేపథ్యంలో ‘మా’ ఎలక్షన్స్ మరింత ఆసక్తికరంగా మారాయి.