Tapsee : అది నిజంగా ఉందా?? దాని గురించి తెలిశాకే సినిమా ఒప్పుకున్నా..

హీరో హీరోయిన్స్ ఒక సినిమాలో నటించాలంటే ఆ కథ గురించి, అందులోని పాత్రల గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. ఇక బయోపిక్స్ కానీ, ఏదైనా స్పెషల్ స్టోరీలు కానీ సినిమా ఒప్పుకుంటే దాని గురించి

Tapsee : అది నిజంగా ఉందా?? దాని గురించి తెలిశాకే సినిమా ఒప్పుకున్నా..

Rashmi

Tapsee :  హీరో హీరోయిన్స్ ఒక సినిమాలో నటించాలంటే ఆ కథ గురించి, అందులోని పాత్రల గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. ఇక బయోపిక్స్ కానీ, ఏదైనా స్పెషల్ స్టోరీలు కానీ సినిమా ఒప్పుకుంటే దాని గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. ఇక స్పోర్ట్స్ కి సంబంధించిన సినిమా అయితే ఆ ఆటపై పట్టు సాధించాలి. అప్పుడే వాళ్ళు ఒప్పుకున్న పాత్రకి న్యాయం చేయగలుగుతారు. హీరోయిన్ తాప్సి ఎప్పటికప్పుడు కొత్త రకమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకి వస్తుంది. తాప్సి నటించిన ‘రష్మీ రాకెట్‌’ సినిమా త్వరలో విడుదల అవ్వబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాప్సి ఈ సినిమా గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు తెలిపింది.

ప్రతి సారి కొత్త పాత్రల్లో కనపడే తాప్సి ఈ సారి క్రీడానేపథ్యం ఉన్న సినిమాని ఎంచుకుంది. గుజరాత్‌కు చెందిన అథ్లెట్‌ రష్మీ బయోపిక్ ఇది. రష్మీ పాత్రలో తాప్సీ కనిపించనుంది. ఈ సినిమా ఓ అంశం చుట్టూ నడుస్తుందని, దానికి సంబంధించిన ఓ పదం అర్థం కాక గూగుల్‌ చేసి మరీ తెలుసుకున్నాను అని తెలిపింది. ఈ సినిమా కోసం స్పోర్ట్స్ పరంగా కూడా బాగా హార్డ్ వర్క్ చేసాను అని తెలిపింది.

Posani Krishna Murali : పోసాని మిస్సింగ్.. ఆందోళనలో నిర్మాతలు..

‘రష్మీ రాకెట్‌’ స్క్రిప్ట్‌ చెప్పేందుకు ఈ సినిమా రచయిత నందా పెరియసామి నన్ను కలిశారు. ఈ సినిమా కథని ఓ వీడియో రూపంలో తీసుకొచ్చి చూపించారు. నాకు అది నచ్చింది. నాకు స్పోర్ట్స్‌ అంటే చాలా ఇష్టం. స్పోర్ట్స్ సబ్జెక్టు రావడంతో చాలా ఆనందించాను. అయితే ఈ సినిమాలో ముఖ్య అంశం ‘‘లింగనిర్ధారణ’’. దీని గురించి నాకు తెలియదు. అర్ధం కాక దీని గురించి గూగుల్‌ చేశాను. ఈ విషయం గురించి వివరాలు తెలుసుకున్నాక షాక్‌ అయ్యాను. అందుకే ఈ సబ్జెక్టుపై జనాలకి అవగాహన కల్పించాలని సినిమా ఒప్పుకున్నాను అని తాప్సి తెలిపింది. ముందు ఇది నిజంగా ఉంటుందా? లేదా సినిమా కోసమని జోడించారా అనుకున్నాను కానీ ఇదంతా నిజంగా జరుగుతుందని తెలిసాక నా ఈ సినిమా ద్వారా సమాజంలో ఈ సమస్యని చూపించగలను అని తాప్సి వివరించింది. ఈ సినిమా అక్టోబర్ 15న జీ5 ఓటీటీ వేదికగా రిలీజ్ అవ్వనుంది.