Posani Krishna Murali : పోసాని మిస్సింగ్.. ఆందోళనలో నిర్మాతలు..

పోసాని ఎక్కడ ఉన్నారనేది తెలియట్లేదని, పోసాని ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదని, పోసాని తమకు అందుబాటులోకి రావడం లేదని నిర్మాతలు తెలిపారు. దీనివల్ల పోసాని కాంబినేషన్ లో ఉన్న షూటింగ్స్ కి

Posani Krishna Murali : పోసాని మిస్సింగ్.. ఆందోళనలో నిర్మాతలు..

Posaani

Updated On : October 2, 2021 / 10:17 AM IST

Posani Krishna Murali :  పవన్ కళ్యాణ్ స్పీచ్ పై ప్రెస్ మీట్ పెట్టి మరీ తీవ్ర విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్. దీంతో పవన్ అభిమానులు, జనసేన నాయకులు పోసానిని వ్యక్తిగతంగా దూషించారు. దీంతో అసహనం కోల్పోయిన పోసాని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి పవన్ పై, పవన్ అభిమానులపై విరుచుకు పడ్డారు. తర్వాత జనసేన నాయకులు పోసానిపై ప్రెస్ క్లబ్ బయట దాడికి యత్నించారు. పోలీసుల సాయంతో అక్కడినుంచి బయటపడ్డాడు పోసాని. ఆ తర్వాత కొంతమంది పవన్ ఫ్యాన్స్ పోసాని ఇంటి పై రాళ్ళ దాడి చేశారు. కానీ పోసాని గత కొద్ది నెలలుగా ఆ ఇంట్లో ఉండకపోవటంతో ఆ ఇంటి వాచ్మెన్ పోలీసులకి ఫిర్యాదు చేసాడు. ఈ నేపథ్యంలో పోసాని తనకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి ప్రాణహాని ఉందని మీడియాకి తెలియ చేసి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు ఇచ్చారు. ఇలా తన పై దాడులకు దిగుతుండటంతో పోసాని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.

Pushpa : పుష్ప రిలీజ్ డేట్ వచ్చేసింది.. సోలోగా వస్తున్న ఐకాన్ స్టార్

పోసాని ఎక్కడ ఉన్నారనేది తెలియట్లేదని, పోసాని ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదని, పోసాని తమకు అందుబాటులోకి రావడం లేదని నిర్మాతలు తెలిపారు. దీనివల్ల పోసాని కాంబినేషన్ లో ఉన్న షూటింగ్స్ కి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. పోసాని కృష్ణమురళి వైఖరితో టాలీవుడ్ నిర్మాతలు భయపడుతున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారు అనే సమాచారం కూడా నిర్మాతలకు లేదని అంటున్నారు. కానీ కొన్ని న్యూస్ చానెళ్ళకి మాత్రం ఫోన్లో
ఇంటర్వ్యూలు ఇస్తున్నారని నిర్మాతలు అన్నారు. అయితే ఈ వివాదం సమసిపోయే దాకా ఆయన బయటకు రాడని నిర్మాతలు భావిస్తున్నారు. ఇదే జరిగితే పోసాని ఉన్న షూటింగ్స్ ఆలస్యం అయినట్టే.