MAA Elections 2021 : నామినేషన్ వెనక్కి తీసుకున్న సీవీఎల్

సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహ రావు ‘మా’ ఎన్నికల బరినుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు..

MAA Elections 2021 : నామినేషన్ వెనక్కి తీసుకున్న సీవీఎల్

Cvl

MAA Elections 2021: ఈసారి ‘మా’ ఎలక్షన్స్ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న వారి మాటలు.. ప్రాంతీయ వాదంతో మొదలై వ్యక్తిగత దూషణల వరకూ వెళ్లాయి. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, యంగ్ హీరో మంచు విష్ణు, సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహ రావు ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. వీరితో పాటు ‘మా’ జనరల్ సెక్రెటరీ పదవికి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న బండ్ల గణేష్.. శుక్రవారం నామినేషన్ ఉపసంహరించుకుని ట్విస్ట్ ఇచ్చాడు.

బిగ్ ట్విస్ట్.. నామినేషన్ ఉపసంహరించుకున్న బండ్ల గణేష్

కట్ చేస్తే ‘మా’ ఎన్నికల బరిలో ఇండిపెండెంట్‌గా అభ్యర్థిగా సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహ రావు కూడా ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. శనివారం ఉదయమే తన మేనిఫెస్టో ప్రకటించిన సీవీఎల్.. కొద్దిసేపటికే నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు.

Jr NTR – Mahesh : మీరు సంక్రాంతికొస్తే.. మేం సమ్మర్‌కి షిఫ్ట్ అవుతాం..

ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను మా ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవికి పోటీలో నామినేషన్ వేశాను.. ఇప్పుడు నామినేషన్ ఉపసంహరించుకున్నాను.. అన్ని వివరాలు రెండు రోజుల్లో మీడియా వారికి చెబుతాను.. ఉదయం కూడా నా మేనిఫెస్టోను ప్రకటించాను.. నేను నామినేషన్ ఉపసంహరించుకోవడానికి కారణం ఉంది.. అధ్యక్ష పదవి కంటే నాకు ‘మా’ సభ్యుల సంక్షేమమే ముఖ్యం.. ఇప్పుడు పోటీలో ఉన్న రెండు ప్యానెల్స్‌లో ఎవ్వరికీ నేను మద్దతు ఇవ్వడం లేదు’’ అన్నారు.

Uttej Emotional Words : ‘చాలా నొప్పిగా ఉంది పద్దూ’.. కంటతడి పెట్టిస్తున్న ఉత్తేజ్ మాటలు..