Uttej Emotional Words : ‘చాలా నొప్పిగా ఉంది పద్దూ’.. కంటతడి పెట్టిస్తున్న ఉత్తేజ్ మాటలు..
తన భార్య గురించి ఉత్తేజ్ రాసిన మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి..

Uttej Wife
Uttej Emotional Words: టాలీవుడ్ పాపులర్ రైటర్, యాక్టర్ ఉత్తేజ్ భార్య ఇటీవల కన్నుమూశారు. జీవితంలో అన్ని విధాల సెటిల్ అవుతున్న సమయంలో భార్య దూరమవ్వడంతో ఉత్తేజ్ షాక్‌కి గురయ్యారు. ఉత్తేజ్ – పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు.

పద్మ మరణవార్త తెలియగానే మెగాస్టార్ చిరంజీవితో సహా పలువురు సినీ ప్రముఖలు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కి వెళ్లి ఆమెకు నివాళులర్పించి ఉత్తేజ్‌ను ఓదార్చారు. గురువారం పద్మ సంస్మరణ సభ ఫిలింనగర్‌లోని FNCC లో జరిగింది.

ఈ కార్యక్రమాని పెద్ద సంఖ్యలో సినీ పరిశ్రమ వారు తరలివచ్చి.. పద్మకు నివాళులర్పించారు. అయితే ఈ వేదిక మీద ఉత్తేజ్ తన భార్యపై ప్రేమను, ఆమె దూరమైన బాధను వ్యక్త పరుస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పలువురిని కంటతడి పెట్టించింది.
Uttej Wife : ఏడవకు ఉత్తేజ్.. నీకు మేమున్నాం..
ఉత్తేజ్ మంచి రచయిత అనే సంగతి తెలిసిందే.. హాస్పిటల్లో ఉన్నప్పుడు భార్య తనతో అన్న మాటలను.. ఇప్పుడు ఆయన పడుతున్న బాధను ఉత్తేజ్ ఇలా వ్యక్తం చేశారు.. ‘‘నువ్వు సరిగ్గా తినట్లేదయ్యా.. నువ్వు తింటేనే నాకు తృప్తి.. ఇంటికెళదాం… పండుగ చేసుకుందాం.. నాన్నా.. నిన్ను వదిలి వెళ్లిపోతానేమోనని ఏడుపొస్తుంది.. (పద్మ)..
ఉన్నంతకాలం నాకో పరిష్కారమై ఇప్పుడు నాకో పెద్ద ప్రశ్ననిచ్చి వెళ్లావ్.. కలలన్నీ సాకారం చేసుకుంటున్న సమయంలో.. నువ్వు లేకుండా అంటే చాలా నొప్పిగా ఉంది పద్దూ..’’ అంటూ ఉత్తేజ్ పేర్కొన్న మాటలు చూసి సినీ ప్రముఖులు భావోద్వేగానికి గురయ్యారు. గర్భవతిగా ఉన్న పెద్ద కుమార్తెను చూసి సినీ జనాలు కంటతడి పెట్టుకున్నారు.
Actor Uttej: ఇలా వదిలేశావ్ ఏంటమ్మా.. కంట తడి పెట్టిస్తున్న ఉత్తేజ్ కూతురు పోస్ట్!