ఏపీలో ప్రైవేట్ బస్సులు నడుపుతున్న యాజమాన్యాలకు రవాణశాఖ మంత్రి పేర్ని నాని గట్టి వార్నింగ్ ఇచ్చారు. అంతు చూస్తామని, తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. రానున్న
ఏపీలో ప్రైవేట్ బస్సులు నడుపుతున్న యాజమాన్యాలకు రవాణశాఖ మంత్రి పేర్ని నాని గట్టి వార్నింగ్ ఇచ్చారు. అంతు చూస్తామని, తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ప్రైవేట్ బస్ ఆపరేటర్ల దోపిడీకి అడ్డుకట్ట వేస్తామన్నారు. ప్రైవేట్ బస్ ఆపరేటర్లకు ఆర్టీసీ తడాఖా ఏంటో చూపిస్తామన్నారు. నేను కానీ ఒక ఈల వేశానంటే.. ప్రైవేట్ బస్సులన్నీ ఇంటికే అని మంత్రి వార్నింగ్ ఇచ్చారు.
బుధవారం(జనవరి 1,2020) విజయవాడలో పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఆర్టీసీ ఉద్యోగులు.. సీఎం జగన్ కు విలీన కతృజ్ఞత సభ నిర్వహించారు. ఇందులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలను హెచ్చరించారు మంత్రి పేర్ని నాని.
సంకాంత్రి పండక్కి ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల రేట్లకు సమానంగా.. ప్రైవేట్ బస్సుల్లోనూ టికెట్ల ధరలు ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. ఏమాత్రం టికెట్ల రేట్లలో తేడా వచ్చినా.. అధిక చార్జీలు వసూలు చేసినా.. ఊరుకునేది లేదన్నారు. ఏపీ బోర్డర్ కు వస్తే సంగతి చూస్తామన్నారు. సరిపడ ఆర్టీసీ బస్సులు వేయలేని పేదరికంలో ఉన్నామని, అప్పుల బాధల్లో ఉన్నామని.. అందుకే చూస్తా ఊరుకున్నామని మంత్రి చెప్పారు. రానున్న రెండు, మూడు ఏళ్లలో.. ఆర్టీసీ అప్పులన్నీ తీరాక, కార్మికులకు బకాయిలు చెల్లించాక, బ్యాంకు అప్పులు తీర్చాక.. ప్రైవేట్ బస్సు ఆపరేటర్లకు ఆర్టీసీ తడాఖా ఏంటో చూపిస్తామన్నారు మంత్రి పేర్ని నాని.
చంద్రబాబు ఆర్టీసీని చంపిస్తే సీఎం జగన్ జీవం పోశారని మంత్రి అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం విషయంలో పొరుగు రాష్ట్రం తెలంగాణ సీఎం కేసీఆర్, 40 ఏళ్ల అనుభం ఉన్న చంద్రబాబు చేయలేని పని.. ఏపీ సీఎం జగన్ 3 నెలల్లోనే చేసి చూపించారని మంత్రి కితాబిచ్చారు.
* ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సాహసోపేత నిర్ణయం
* చంద్రబాబు, కేసీఆర్ చేయలేనిది జగన్ చేశారు
* జగన్ అధికారంలోకి రాగానే ఆర్టీసీకి జీవం పోశారు
* 2014-19 వరకు పోలవరం, తిరుపతి టూర్ లకు చంద్రబాబు సభలకు బస్సులు వాడుకుని ఆర్టీసీని పీల్చిపిప్పి చేశారు
* అప్పులన్నీ తీరాక ప్రైవేట్ బస్సు ఆపరేటర్లకు ఆర్టీసీ తడాఖా చూపిస్తాం
* సంక్రాంతికి అధిక టికెట్ ధరలు వసూలు చేస్తే ప్రైవేట్ బస్ ఆపరేటర్ల సంగతి చూస్తాం
* నేను ఒక ఈల వేస్తే ప్రైవేట్ బస్సులు ఇంటికే
* ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని ఉద్యోగులు కోరితే కుదరదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు
* ఏపీలో ఏమవుతుందో మూడు నెలల తర్వాత చూడండి.. మన్ను మిగులుతుందని కేసీఆర్ అన్నారు
* 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబూ ఆర్టీసీ విలీనం కుదరదని చెప్పారు
* సీఎం జగన్.. మూడే నెలల్లోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి చూపించారు