Tirupati : మంత్రి రోజా సెల్ ఫోన్ మిస్సింగ్.. మూడు పోలీసు టీంల గాలింపు

ఏపీ రాష్ట్ర నూతన మంత్రిగా నియమితులైన రోజా.. సెల్ ఫోన్ మిస్ కావడం కలకలం రేపుతోంది...ఎస్వీ యూనివర్సిటీ సెట్ హాల్ లో నిర్వహించిన శ్యాప్ సమావేశంలో మంత్రి రోజా పాల్గొన్నారు...

  • Published On : April 21, 2022 / 01:02 PM IST

Minister Roja On Jagan

Minister Roja Cell Phone Missing : ఏపీ రాష్ట్ర నూతన మంత్రిగా నియమితులైన రోజా.. సెల్ ఫోన్ మిస్ కావడం కలకలం రేపుతోంది. 2022, ఏప్రిల్ 21వ తేదీ గురువారం తిరుపతికి వచ్చారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎస్వీ యూనివర్సిటీ సెట్ హాల్ లో నిర్వహించిన శ్యాప్ సమావేశంలో మంత్రి రోజా పాల్గొన్నారు. తర్వాత చూసుకోగా.. సెల్ ఫోన్ కనిపించలేదు. దీంతో సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం అందించారు. సెల్ ఫోన్ ఎవరు దొంగిలించారో తెలియడం లేదు. ప్రస్తుతం ఆ సెల్ ఫోన్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఏకంగా మూడు పోలీసు టీంలను ఏర్పాటు చేశారు. పద్మావతి గెస్ట్ హౌస్ తో పాటు ఎస్వీ యూనివర్సిటీలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Read More : Minister Roja On Jagan : జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం- మంత్రి రోజా

ఇటీవలే ఏపీ కేబినెట్ ను సీఎం జగన్ పునర్ వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. ఇందులో రోజాకు మంత్రి పదవి వరించింది. ఏపీ టూరిజం శాఖ మంత్రిగా ఆమెను నియమించారు. బాధ్యతలు కూడా స్వీకరించారు. కుటుంబసభ్యుల మధ్య తొలి ఫైల్ పై సంతకం చేశారు. గండికోట టూ బెంగళూరు, బెంగళూరు టూ గండికోట బస్ సర్వీసును ప్రారంభిస్తూ తొలి ఫైల్ పై సంతకం చేశారామె. అనంతరం మొదటిసారిగా తిరుపతికి చేరుకున్నారు. 2022, ఏప్రిల్ 20వ తేదీ బుధవారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆమెకు వైసీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీతో నగరి ర్యాలీకి బయలుదేరారు. వైసీపీ పార్టీలో ఆమె ఫైర్ బ్రాండ్ లీడర్ గా గుర్తింపు పొందారు. తొలి విడతలోనే మంత్రి పదవి వస్తుందని రోజా ఆశించినా.. అది నెరవేరలేదు. ఎమ్మెల్యేగా రెండో సారి గెలిచిన రోజాకు ఎట్టకేలకు మంత్రి పదవి రావడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు.