Minister Roja: పవన్ కళ్యాణ్‌కు సీఎం అయ్యే సీన్ లేదు.. ఆయన రీల్ హీరోనే..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రీల్ హీరో, ఆయన రియల్ లైఫ్ లో హీరో కాదు.. రియల్ లైఫ్ లో పవన్ సీఎం కాలేడు అంటూ వ్యాఖ్యానించారు.
- Harishth Thanniru
- Published On : June 7, 2022 / 03:07 PM IST
Ministar Roja
Minister Roja: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రీల్ హీరో, ఆయన రియల్ లైఫ్ లో హీరో కాదు.. రియల్ లైఫ్ లో పవన్ సీఎం కాలేడు అంటూ వ్యాఖ్యానించారు. మంగళవారం తిరుపతిలో వైయస్సార్ యంత్ర సేవా పథకం కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు ఏ మాత్రం లేదని, వారికి కావాల్సింది అధికారమే అంటూ రోజా విమర్శించారు. పొత్తులు పెట్టుకొని ఎన్నికలకు వచ్చినంతమాత్రాన వైసీపీని ఎవరూ ఏం చేయలేరని, ప్రజలంతా సీఎం జగన్ కు మద్దతుగా నిలుస్తున్నారని రోజా అన్నారు.
Roja Satires On Pawan : పవన్‌కు ఒకటే ఆప్షన్ – జనసేనాని మూడు ఆప్షన్లపై మంత్రి రోజా సెటైర్
పవన్ కళ్యాణ్ రీల్ హీరో మాత్రమేనని, ఆయన రియల్ హీరో కాదంటూ రోజా వ్యాఖ్యానించారు. రెండున్నర గంటల సినిమాల్లో పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్ కూడా కావచ్చు. కానీ నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ కు సీఎం అయ్యే సీన్ లేదని రోజా ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు స్పష్టంగా చెబితే ఎవరైనా సీఎం కావొచ్చు అంటూ వ్యాఖ్యానించారు. వైసీపీని ఎదుర్కోలేక చంద్రబాబు తంటాలు పడుతున్నాడని, ప్రజలంతా జగన్ వెంట ఉండటం చూసి చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని రోజా ఆరోపించారు. పొత్తుల పెట్టుకున్నంత మాత్రాన వైసీపీని ఎవరు ఏం చేయలేరని, సింగల్ గానే సీఎం జగన్ ఆధ్వర్యంలో ప్రజల్లోకి వెళ్తామని, వచ్చే ఎన్నికల్లో 160 స్థానాలు మావేనని మంత్రి రోజా అన్నారు.
