Roja Satires On Pawan : పవన్‌కు ఒకటే ఆప్షన్ – జనసేనాని మూడు ఆప్షన్లపై మంత్రి రోజా సెటైర్

పొత్తుల గురించి పవన్ ప్రస్తావించిన మూడు ఆప్షన్ల వ్యాఖ్యలపై స్పందించిన రోజా.. సెటైర్లు వేశారు. అసలు 175 స్థానాల్లో పోటీ చేయకుండానే పవన్ సీఎం ఎలా అవుతారని ప్రశ్నించారు.(Roja Satires On Pawan)

Roja Satires On Pawan : పవన్‌కు ఒకటే ఆప్షన్ – జనసేనాని మూడు ఆప్షన్లపై మంత్రి రోజా సెటైర్

Roja Satires On Pawan

Roja Satires On Pawan : వైసీపీ ఫైర్ బ్రాండ్‌, మంత్రి ఆర్కే రోజా మ‌రోసారి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఫైర్ అయ్యారు. తీవ్ర విమర్శలు, సెటైర్లు చేశారు. పొత్తుల గురించి పవన్ ప్రస్తావించిన మూడు ఆప్షన్ల వ్యాఖ్యలపై స్పందించిన రోజా.. సెటైర్లు వేశారు. పవన్ మూడు ఆప్షన్లు ఇస్తే ప్రజలు ఆయనకు ఒకటే ఆప్షన్ ఇస్తారని రోజా అన్నారు. జనసేన పార్టీని ప్రజలు గెలిపించే ప్రసక్తే లేదన్నారామె. అసలు 175 స్థానాల్లో పోటీ చేయకుండానే పవన్ సీఎం ఎలా అవుతారని మంత్రి రోజా ప్రశ్నించారు. పవన్‌ పోరాటం ప్రజల కోసం కాదని, పొత్తుల కోసమేన‌ని రోజా విమర్శించారు. 2019 ఎన్నిక‌ల్లో పవన్‌ను రాష్ట్ర ప్ర‌జ‌లు రెండు చోట్ల ఓడించారని గుర్తు చేసిన మంత్రి రోజా.. 2024 ఎన్నిక‌ల్లో అదే రిపీట్‌ అవుతుందని జోస్యం చెప్పారు.

పవన్ ప్రజల కోసం పోరాడతారనుకుంటే పొత్తుల కోసం పోరాడతున్నారని మంత్రి రోజా విమర్శించారు. 2019లో రెండు చోట్ల పవన్ ఓడిపోయారని, 2024లోనూ అదే రిపీట్ అవుతుందన్నారు. అలాగే ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీకి కచ్చితంగా టీడీపీ, జనసేన సపోర్ట్ చేస్తాయన్న ఆమె.. ప్రజలు వైసీపీనే గెలిపిస్తారని అన్నారు.(Roja Satires On Pawan)

Pawan Kalyan Three Options : 3 ఆప్షన్లతో ముందుకొచ్చిన పవన్.. పొత్తులు, సీఎం అభ్యర్థిపై జనసేనాని హాట్ కామెంట్స్

”నాది పోరాటాల పార్టీ. ప్రజల కోసం పోరాడేదానికే నేను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకునే పెద్ద మనిషి.. ప్రజల కోసం పోరాడకుండా షూటింగ్స్ చేసుకుంటూ.. ఎన్నికలు వచ్చినప్పుడు మరి దేనికోసం వస్తారో తెలియదు కాని.. ప్రజలకు మూడు ఆప్షన్లు ఇస్తానంటారు. కానీ ప్రజలు ఒకే ఆప్షన్ పవన్ కు డిసైడ్ చేశారు. అది 2019 ఎన్నికల్లో చూశారు. రెండు చోట్ల నిల్చుంటే రెండు చోట్లా ఓడించారు. భవిష్యత్తులో కూడా ప్రజలది ఒకటే ఆప్షన్. జనసేన పార్టీని ఎక్కడా కూడా గెలిపించే పరిస్థితి లేదు” అని మంత్రి రోజా ఎద్దేవా చేశారు.

”ఎంతసేపు బీజేపీకి ఓటు వేయండి, టీడీపీకి ఓటు వేయండి నేను వచ్చేస్తాను సీఎంగా అంటారు. 175 చోట్ల పోటీ చేయకుండా పవన్ సీఎం ఎలా అవుతారు? ఏ విధంగా ప్రజలకు మేలు చేస్తారు? ఇక చంద్రబాబు పార్టీ చూస్తే.. లోకేష్ స్వయంగా చిట్ చాట్ లో చెప్పారు. మాకింకా 50 చోట్ల అభ్యర్థులే లేరని. మరి 175 స్థానాల్లో 50 చోట్ల అభ్యర్థులే లేరని చెబితే ఏ విధంగా టీడీపీ వాళ్లు అధికారంలోకి వస్తారు?” అని రోజా ప్రశ్నించారు.(Roja Satires On Pawan)

”టీడీపీ వాళ్లు సంకలు గుద్దుకుంటున్నారు. మా ప్లీనరీ సక్సెస్ అయిందని, వార్ వన్ సైడ్ అని సంబరపడుతున్నారు. వార్ వన్ సైడ్ అనేది జగన్ కి మాత్రమే. అది ఏ ఎన్నికలు పెట్టినా కూడా. ఆత్మకూరు ఉపఎన్నికలోనూ అదే జరుగుతుంది” అని మంత్రి రోజా విశ్వాసం వ్యక్తం చేశారు.

kvp ramachandra rao: పాచిపోయిన లడ్లు ఇచ్చారన్నారు.. అదే బీజేపీతో పవ‌న్‌ పొత్తులో ఉన్నారు: కేవీపీ రామచంద్రరావు

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపైనా మంత్రి రోజా విమర్శలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతమని ధ్వ‌జ‌మెత్తారు. టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. బద్వేలుకి మించిన మెజారిటీ ఆత్మకూరులో వైసీపీకి వస్తుందని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు. బద్వేలు ఉప ఎన్నిక‌లో బీజేపీకి వెనుక నుంచి మద్దతు ఇచ్చిన టీడీపీ, జనసేన ప్రయత్నాలు ఫలించలేదన్నారు.(Roja Satires On Pawan)

”బీజేపీ వాళ్లు ఎందుకు పోటీ చేస్తున్నారో కనీసం వాళ్లకైనా అర్థం అవుతుందో లేదో నాకైతే అర్థం కాలేదు. బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలెవరూ పట్టించుకోని పరిస్థితి. తెలుగుదేశం, జనసేన సపోర్ట్ ఇస్తుందని బద్వేల్ లో బీజేపీ పోటీ చేసింది. ఆ విధంగానే టీడీపీ, జనసేన సపోర్ట్ చేసి ఓట్లు వేయించినా బీజేపీ పరిస్థితి ఏంటో స్పష్టంగా అందరూ చూశాం. అలాంటిది ఆత్మకూరులో బీజేపీకి ఏ విధంగా ఓట్లు పడతాయి? ఇవాళ టీడీపీ, జనసేన మళ్లీ కనుక అలాంటి దొంగ పనే చేస్తే రాబోయే 2024 జనరల్ ఎలక్షన్స్ లో మళ్లీ వాళ్లకు సింగిల్ డిజిట్ కూడా ఉండదు ” అని మంత్రి రోజా హెచ్చరించారు.