kvp ramachandra rao: పాచిపోయిన లడ్లు ఇచ్చారన్నారు.. అదే బీజేపీతో పవ‌న్‌ పొత్తులో ఉన్నారు: కేవీపీ రామచంద్రరావు

kvp ramachandra rao: పాచిపోయిన లడ్లు ఇచ్చారన్నారు.. అదే బీజేపీతో పవ‌న్‌ పొత్తులో ఉన్నారు: కేవీపీ రామచంద్రరావు

Updated On : June 5, 2022 / 2:59 PM IST

kvp ramachandra rao: జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ కేవీపీ రామచంద్రరావు విమ‌ర్శ‌లు గుప్పించారు. కడప జిల్లాలో ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… జనసేన అనేది పవన్ కల్యాణ్‌కు చెందిన‌ పార్టీ అని, ఆయ‌న పార్టీ పెట్టుకునే పొత్తుల గురించి మాట్లాడే అధికారం ఆయనకు ఉంటుందని అన్నారు. ఆయన ఎప్పుడు ఎవరితో అయినా పొత్తులు పెట్టుకోవచ్చని చెప్పారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్ళార‌ని గుర్తు చేశారు. అయితే, భవిష్యత్తులో జనసేనాని ఎవరితో పొత్తులు పెట్టుకుంటారో ఆయనకే అవగాహన లేదని చుర‌క‌లంటించారు.

Biden: గ‌గ‌న‌త‌ల నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తూ వ‌చ్చిన విమానం.. సుర‌క్షిత ప్రాంతానికి అమెరికా అధ్య‌క్షుడు బైడెన్

ఆంధ్రప్రదేశ్‌కు పాచిపోయిన లడ్లు ఇచ్చారని విమర్శించిన ప‌వన్.. నేడు అదే బీజేపీతో పొత్తులో ఉన్నార‌ని కేవీపీ విమ‌ర్శించారు. బద్వేలు ఉప ఎన్నికలో పవన్ బీజేపీకి మద్దతిచ్చారని, ఇప్పుడేమో టీడీపీతో కూడా పొత్తు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. ఇంత గొప్ప‌ పవన్ క‌ల్యాణ్‌ను విమర్శంచేంత స్థాయి, మెచ్యురిటీ త‌నకు లేదంటూ చురకలు అంటించారు. తాము కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ముందుకు వెళ్తామ‌ని ఆయ‌న చెప్పారు.