Minister Roja: అందుకే చంద్రబాబు, పవన్ కల్యాణ్ వణుకుతున్నారు: రోజా

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి రోజా మండిపడ్డారు. తిరుపతిలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పనులను చూసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు వణుకుతున్నారని చెప్పారు. అందుకే జీవో నంబరు 1 పేరిట అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు.

Minister Roja: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి రోజా మండిపడ్డారు. తిరుపతిలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పనులను చూసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు వణుకుతున్నారని చెప్పారు. అందుకే జీవో నంబరు 1 పేరిట అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు.

సీఎం జగన్ పై ఎవరైనా ఇష్టారీతిన మాట్లాడితే తాము చూస్తూ ఊరుకోబోమని చెప్పారు. టీడీపీ, జనసేన సైకో పార్టీలని ఆమె విమర్శించారు. అతిపెద్ద రాజకీయ సైకో చంద్రబాబు అని ఆమె వ్యాఖ్యానించారు. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు చీదరించుకున్నారని చెప్పారు. పవన్ కల్యాణ్ ను సొంత జిల్లా, నియోజకవర్గంలోనే ఓటర్లు ఓడించారని అన్నారు.

చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తే పవన్ కల్యాణ్ వాటి గురించి మాట్లాడకుండా నోటికి ప్లాస్టర్ వేసుకుంటారని ఆమె ఎద్దేవా చేశారు. కందుకూరు, గుంటూరు బాధితులు పవన్ కల్యాణ్ కు కనపడలేదా? అని ఆమె నిలదీశారు. కాగా, ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కందుకూరు, గుంటూరులో సభలు నిర్వహించగా పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే.

India Vs Sri Lanka: అర్ధ సెంచరీ బాదిన శ్రీలంక బ్యాట్స్‌మన్ మెండీస్.. 8 ఓవర్లలో 80 పరుగులు