Seediri appalaraju : చెప్పులు పొతే తెచ్చుకొవచ్చు,కానీ పార్టీ గుర్తుపోతే ఎలా..? : పవన్‌పై మంత్రి సిదిరి సెటైర్లు

మీ పార్టీ గుర్తుపోయింది గుర్తుపెట్టుకొండి పవన్. మీ పార్టీ గుర్తు ఎలక్షన్ కమీషన్ ఎవరికి కేటాయించిందో తెలుసుకోండీ..ఎక్కడ ఉందో వెతుక్కోండీ.

Pawan Kalyan..seediri appalaraju

Minister seediri appalaraju : నేను అసెంబ్లీకి వెల్లడానికి ఎవరు అపుతారు. అని పవన్ కల్యాణ్ అంటున్నారు. మరి ఎందుకు యాత్రలు చేస్తున్నారు? తాను ఎమ్మెల్యేగా గెలవటానికి తిరుగుతున్నారా…? లేదా ఆయన ఎమ్మెల్యేలను గెలిపించేందుకా అనేది పవన్ కు క్లారిటీ లేదు అంటూ మంత్రి సిదిరి అప్పలరాజు ప్రశ్నించారు. పవన్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడో డిసైడ్ కావాలని సూచించారు‌. వారాహి యాత్ర అసంబద్దమైన‌ యాత్ర అంటూ తీసిపారేశారు.

చెప్పులు గురించి పవన్ మాట్లాడుతున్నారు..కానీ తన‌పార్టీ గుర్తు గురించి మాట్లాడాలని అన్నారు. చెప్పులు మర్చిపొతే తెచ్చుకొవచ్చు..గుర్తు పోతే ఎలా…? అంటూ ఎద్దేవా చేశారు. చెప్పులు గురించి తరువాత ఆలోచించుకోవచ్చు.. ముందు మీ పార్టీ గుర్తుపోయింది గుర్తుపెట్టుకొండి పవన్ పై సెటైర్ వేసారు. గుర్తు ఎక్కడ ఉందో..ఎలక్షన్ కమీషన్ ఎవరికి కేటాయించిందో తెలుసుకోండీ..ఎక్కడ ఉందో వెతుక్కోండీ అంటూ కౌంటర్ ఇచ్చారు.

Kanna Lakshminarayana : సహకార రంగంలో రూ.5 వేల కోట్ల అవినీతి, రైతుల పేర్లతో రుణాలు తీసుకుని వైసీపీ నేతలు దోచేస్తున్నారు : కన్నా

2014, 2019 లో‌ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలన్నీ కలిసి పనిచేశాయి. తెరముందు నాటకాలు ..తెర వెనుక అంతా కలసే సంసారం చేస్తున్నారంటూ విమర్శించారు.2019లో భీమవరం, గాజువాకలో వైసీపీ ఓడించిందని పవన్ మాటాడుతున్నారు..అంటే టీడీపీ 2019లో జనసేనకు సహాకరించిందా?అని ప్రశ్నించారు. వైసీపీ ఓడించిందని మాటాడటం అంటే మిగిలిన పార్టీలు కలసి పనిచేసినట్లే‌ కదా? అని అన్నారు. 2024 లో ఏ మార్పు ఉండదు.. జగన్ ముందు నుంచి ఒకటే చెపుతున్నారు..వైసిపి ఒంటరిగానే పోటీ చేస్తుందని..అన్ని చోట్లా పోటీలో ‌ఉంటాం అని స్పష్టంచేశారు.

నన్ను సీఎంను చేయమని పవన్ అడుగుతున్నారు..మరి ఎన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తారు? అని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి కావాలంటే రాష్ట్రం మొత్తం పోటీ చేయాలి..30 నియొజకవర్గలలో పోటీ చెస్తేనే సీఎం కాలేరని తెలుసుకోవాలంటూ పవన్ కు చురకలు వేశారు.ముఖ్యమంత్రి పదవి ప్రజలు ఇవ్వాలి తప్ప ముష్టి అడిగితే వచ్చేది కాదన్నారు మంత్రి సిదిరి అప్పలరాజు.

Nara Lokesh : జగన్ పాలనలో ఏపీ క్రైం క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది : నారా లోకేశ్

 

ట్రెండింగ్ వార్తలు