Nara Lokesh : జగన్ పాలనలో ఏపీ క్రైం క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది : నారా లోకేశ్

10th క్లాస్ అబ్బాయి అమ‌ర్ నాథ్‌ని దారుణంగా కొట్టి త‌గ‌ల‌బెట్ట‌టం నేరం కాదా సార్?అమర్ నాథ్ త‌న అక్క‌ని వైసీపీ కార్యకర్త వెంకటేశ్వరరెడ్డి వేధిస్తున్నాడని అతనిని నిలదీయటమేనా ఆ బీసీ బాలుడు అమ‌ర్ నాథ్ చేసిన పాపం? వైసీపీ బుద్ధితో కాకుండా ద‌య‌చేసి ఐపీఎస్ బుద్ధితో చూడండి సార్..

Nara Lokesh : జగన్ పాలనలో ఏపీ క్రైం క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది :  నారా లోకేశ్

Nara Lokesh

Updated On : June 17, 2023 / 1:38 PM IST

Nara Lokesh yuva galam : యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంట్లో భాగంగా జగన్ పాలనలో ఏపి క్రైం క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా మారిపోయింది అంటూ విమర్శించారు. ఈ సందర్భంగా లోకేశ్ డీజీపీని ఉద్దేశించి..రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపులో ఉన్నాయ‌ని, క్రైమ్ రేట్ పెర‌గ‌లేద‌ని నిన్న‌నే క‌దా మీకు మీరు స‌ర్టిఫికెట్ ఇచ్చుకున్నారు..మరి అమ‌ర్ నాథ్‌ అనే 10th క్లాస్ అబ్బాయి అత్యంత దారుణంగా కొట్టి త‌గ‌ల‌బెట్ట‌డం నేరం కాదా సార్? అంటూ ప్రశ్నించారు.

Buddha Venkanna : సొంత పార్టీ ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయితే సీఎం జగన్ ఎందుకు స్పందించట్లేదు : బుద్ధా వెంకన్న

బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పాలవారిపాలేనికి చెందిన వైసీపీ కార్యకర్త వెంకటేశ్వరరెడ్డి 10th క్లాస్ అబ్బాయి అమ‌ర్ నాథ్‌ని అత్యంత దారుణంగా కొట్టి త‌గ‌ల‌బెట్ట‌ారని అది నేరం కాదా సార్? అంటూ ప్రశ్నించారు. అమర్ నాథ్ త‌న అక్క‌ని వైసీపీ కార్యకర్త వెంకటేశ్వరరెడ్డి వేధిస్తున్నాడని అతనిని నిలదీయటమే నా ఆ బీసీ బాలుడు అమ‌ర్ నాథ్ చేసిన పాపం? అంటూ ప్రశ్నించారు.
ఈ ఘటనను వైసీపీ బుద్ధితో కాకుండా ద‌య‌చేసి ఐపీఎస్ బుద్ధితో చూడండి అంటూ కోరారు.

Devineni Uma : మా ప్రభుత్వం వచ్చాక.. జైలుకెళ్లడం ఖాయం- దేవినేని ఉమ వార్నింగ్

సీఎం నియోజ‌క‌వ‌ర్గంలో ద‌ళితుడు కృష్ణ‌య్య హ‌త్య‌, సీఎం జిల్లాలో ద‌ళిత మ‌హిళ నాగ‌మ్మ‌పై హ‌త్యాచారం, సీఎం ఇంటి ప‌క్క‌నే గ్యాంగ్ రేప్‌, నెల్లూరులో పట్టపగలే యువతిపై అత్యాచారం, ఎంపీ కుటుంబ‌స‌భ్యుల కిడ్నాప్ ఈ దారుణ‌మైన నేరాలు-ఘోరాలు మీ కంటికి వైసీపీ పాల‌న‌లో చేప‌డుతున్న స్వ‌చ్ఛంద‌సేవా కార్య‌క్ర‌మాల్లా క‌నిపించ‌డం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల దౌర్భాగ్యం అని అన్నారు. ఇన్ని దారుణాలు పాత బీహార్‌లోనూ జ‌రిగి ఉండ‌వని అన్నారు. జగన్ పాలనలో ఏపి క్రైం క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది అంటూ విమర్శించారు.