Buddha Venkanna : సొంత పార్టీ ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయితే సీఎం జగన్ ఎందుకు స్పందించట్లేదు : బుద్ధా వెంకన్న

విశాఖలో జరిగిన రూ.60వేల కోట్ల భూ కుంభకోణం దందాలో వాటాలు తేడాలు రావటంతో ఎంపీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ అయింది. ఇటువంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి పరిస్థితి ఏంటో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Buddha Venkanna : సొంత పార్టీ ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయితే  సీఎం జగన్ ఎందుకు స్పందించట్లేదు : బుద్ధా వెంకన్న

Buddha Venkanna

Updated On : June 17, 2023 / 11:54 AM IST

TDP Leader Buddha Venkanna : విశాఖ వైసీపీ ఎంపీ ఏవివి సత్యనారాయణ భార్య, కుమారుడు కిడ్నాప్ ఘటనపై ఉత్తరాంధ్ర తెలుగుదేశం ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న సీఎం జగన్ పై ప్రశ్నలు సంధించారు. సొంత పార్టీ ఎంపీ కుటుంబం కిడ్నాప్ కు గురైతే సీఎం జగన్ ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. విశాఖ ఎంపీ కుటుంబం కిడ్నాప్ పై డీజీపీ అల్లిన కట్టుకథకు సెల్యూట్ చేస్తున్నా అంటూ ఎద్దేవా చేశారు. ఎంపీ కుటుంబ కిడ్నాప్ ఉదంతాన్ని కేంద్రం సుమోటోగా తీసుకుని సీబీఐ విచారణ జరిపితేనే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు.

Andhra pradesh : విశాఖలో కిడ్నాప్ కలకలం.. ఎంపీ భార్య, కుమారుడు కిడ్నాప్..?!

బాబాయ్ కి బాత్రూమ్ ట్రీట్మెంట్, ఎంపీ కుటుంబానికి కిడ్నాప్ ట్రీట్మెంట్ లా రేపు తన పరిస్థితి ఏంటోననే భయంతో విజయసాయి రెడ్డి ఉన్నారని..జగన్మోహన్ రెడ్డి నుంచి తనకు ప్రాణహానీ పొంచి ఉందని విజయసాయికి తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో జరిగిన రూ.60వేల కోట్ల భూ కుంభకోణం దందాలో వాటాలకు సంబంధించి తేడాలు వచ్చాయని అందుకే ఎంపీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ అయింది అంటూ ఆరోపణలు చేశారు.

ఈ సందర్భంగా బుద్ధా ఎమ్మెల్యే కోడాలినానిపై విమర్శలు చేశారు. కొడాలి బతుకే ఓ లాలూచీ బతుకు అంటూ మండిపడ్డారు. నోటికొచ్చిన అబద్దాలు చెప్పే కొడలినాని అన్నం తింటున్నాడా గుట్కాలు తింటున్నాడా? అంటూ ప్రశ్నించారు. సెంటు భూమి పేరుతో నాని చేసిన కుంభకోణంపై తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని అన్నారు.
గుడివాడ ప్రజలు కొడాలినానికి ఎప్పుడో గోరీ కట్టారని… ఒళ్లు కొవ్వెక్కి దిగిన బుల్లెట్ తెలియట్లేదంతే అంటూ బుద్ధా సెటైర్లు వేశారు.

Andhra pradesh : కిడ్నాప్ అయిన ఎంపీ కుమారుడు, భార్య, ఆడిటర్ జీవీ సేఫ్ .. కొద్ది గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు