Minister Sriranganatha Raju: ప్రభుత్వంపై భారం పెరిగినా నిర్వాసితుల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం: మంత్రి చెరుకువాడ

నిర్వాసితులను ఆదుకునే విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వంపై భారం పెరిగినా.. వారి సంక్షేమం కోసం పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అన్నారు

Minister Sriranganatha Raju: తాడ్వాయి ఆర్ అండ్ ఆర్, పోలవరం ప్రోజెక్టుల నిర్వాసితులను ఆదుకునే విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వంపై భారం పెరిగినా.. వారి సంక్షేమం కోసం పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అన్నారు. శుక్రవారం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మరియు సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మంత్రి ఆ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ..తాడ్వాయి ఆర్ అండ్ ఆర్ కింద గిరిజనేతరులకు కూడా సుమారు 3000 ఇళ్ల నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. అయితే 2013లో పెరిగిన భూసేకరణ చట్టప్రకారం.. నిర్వాసితులకు అదనంగా ప్యాకేజి చెల్లించాల్సి వస్తుందని.. దీంతో ప్రభుత్వం పై ఆర్ధిక భారం పెరిగినా కూడా నిర్వాసితుల క్షేమమే ధ్యేయంగా మా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి తెలిపారు.

Also read: TRS Minister : అందుకే శ్రీనివాస్ గౌడ్‌‌ని చంపాలనుకున్నా.. హత్యా ప్రయత్నం కేసులో సంచలనాలు

ప్రాజెక్టు నిర్మాణం కంటే ఆ ప్రాజెక్ట్ కోసం నిర్వాసితులను తరలించడం శ్రమతో కూడుకున్న పని అని మంత్రి అన్నారు. నిర్వాసితులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ కంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ ఎక్కువ అని మంత్రి శ్రీరంగనాథ రాజు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ వలన నష్టపోయిన నిర్వాసితులకు అన్ని సదుపాయాలతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తున్నట్లు మంత్రి వివరించారు. తూర్పుగోదావరి జిల్లా నిర్వాసితులు.. పశ్చిమ వైపు రావడానికి సుముఖత చూపిస్తున్నారని.. ఈ పునరావాస కేంద్రాలు రాబోయే రోజుల్లో బ్రహమ్మండమైన కాలనీగా అభివృద్ధి చెందుతాయని మంత్రి శ్రీరంగనాథ రాజు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పోలవరం సహా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపడుతున్న పలు ప్రాజెక్టులను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రెండు రోజుల పాటు పర్యటనకు వచ్చారు.

Also read: Botsa Satyanarayana: రాజధాని అంశంలో హైకోర్టు తీర్పుపై స్పందించిన మంత్రి బొత్స

ట్రెండింగ్ వార్తలు