Mis C Aarogyasri
MIS-C Aarogyasri : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లల్లో ఎదురవుతున్న మిస్-సి మల్టీసిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ జబ్బును కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది. ఇప్పటికే కరోనా తో పాటు బ్లాక్ ఫంగస్ వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చిన జగన్ సర్కార్ తాజాగా మిస్ సి ని కూడా ఆ జాబితాలో చేర్చటంతో ఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి కుటుంబాలకు ఆర్ధిక భారం తగ్గనుంది. ప్రభుత్వమే వైద్య ఖర్చు భరించనుంది.
మిస్-సిలో నాలుగు రకాల జబ్బులకు కేటగిరి వారిగా వైద్య ఖర్చులు ఫిక్స్ చేశారు.
మిస్-సి విత్ షాక్, లేదా విత్‌ఔట్ రెస్పిరేటరీ (సివియర్): రూ.77,533తో పాటు ఎన్‌ఐవీ/వెంటిలేటర్‌కు అదనంగా రూ.25వేలు.
దీంతో పాటు ఇమ్యునోగ్లోబులిన్ మందులకు అదనంగా ఉంటుంది.
ఐదు రోజులు ఐసీయూ, ఐదు రోజులు నాన్ ఐసీయూలో ఉండాలి.
మిస్-సి వితౌట్ షాక్ (మోడరేట్) : దీనికి రూ.42,233లు (మందులతో కలిపి).
ఐదు రోజులు ఐసీయూ, ఐదు రోజులు నాన్ ఐసీయూలో ఉండాలి.
మిస్-సి కవాసాకి లేదా సివియర్ : రూ.62,533లు (మందులతో కలిపి).
దీనికీ ఐదు రోజులు ఐసీయూలోనూ మరో ఐదు రోజులు నాన్ క్రిటికల్ వార్డులో ఉండాలి.
ఫిబ్రిల్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ దీనికి రూ.42,183గా నిర్ణయించారు. ఒకరోజు ఐసీయూలో, ఏడు రోజులు నాన్ ఐసీయూలో ఉండాలి.
ఇవి కాకుండా ఐవీ, ఐజీ డ్రగ్స్, ఐదు గ్రాముల వయెల్ కు 8వేలు, 10గ్రాముల వయెల్ కు 13,500 చెల్లిస్తారు.
వెంటిలేటర్, ఎన్ఐవి లకు గరిష్టంగా 5రోజులకు రూ.25వేలు చెల్లించనున్నారు.