AP Mega DSC 2025 : ఏపీ మెగా డీఎస్సీ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది.. 49శాతం మంది మహిళలు.. ఎంపికైన అభ్యర్థులకు మంత్రి లోకేశ్ అభినందనలు

AP Mega DSC 2025 : ఏపీ మెగా డీఎస్సీ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. స్కూల్స్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ కోనా శశిధర్ విడుదల చేశారు.

AP Mega DSC 2025 : ఏపీ మెగా డీఎస్సీ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది.. 49శాతం మంది మహిళలు.. ఎంపికైన అభ్యర్థులకు మంత్రి లోకేశ్ అభినందనలు

AP Mega DSC 2025

Updated On : September 15, 2025 / 10:50 AM IST

AP Mega DSC 2025 : ఏపీ మెగా డీఎస్సీ -2025 ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. డీఎస్సీ ఫైనల్ లిస్ట్‌ను స్కూల్స్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ కోనా శశిధర్ సోమవారం ఉదయం విడుదల చేశారు. డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో దీన్ని అందుబాటులో ఉంచారు.

డీఎస్సీ ఫైనల్ లిస్ట్ విడుదలైన సందర్భంగా కోన శశిధర్ మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఫైనల్ డీఎస్సీ లిస్ట్ విడుదల చేశామని చెప్పారు. 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని, ఎంతో పారదర్శకంగా డీఎస్సీ ప్రక్రియ జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌లకు ధన్యవాదాలు తెలిపారు.

మెగా డీఎస్సీలో 3లక్షల36వేల300 మంది అభ్యర్థుల నుంచి 5లక్షల7వేల675 అప్లికేషన్లు వచ్చాయని, 16,346 పోస్టులను నోటిఫై చేస్తే 15,941 ఉద్యోగాలు ఇచ్చామని.. మిగిలిన వాటికి సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు రాలేదని చెప్పారు. ఎంపిక అయిన వారికి విద్యాశాఖలోకి స్వాగతం చెప్తున్నాం.. ఫైనల్ లిస్ట్‌లో ఉన్న 15,941లో 49శాతం మంది మహిళలు ఉన్నారని తెలిపారు.
ఈనెల 19న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నియామక పత్రాలు అందజేస్తామని కోన శశిధర్ తెలిపారు. త్వరలో పోస్టింగ్ ఎక్కడ అనేది కౌన్సెలింగ్ ఉంటుంది. ఇవాళ డీఎస్సీ వెబ్ సైట్ లో లిస్ట్ ఉంటుంది. హారిజంటల్ రిజర్వేషన్లు కొత్తగా మనం ఇచ్చాము. సందేహాలు ఉంటే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ఫైనల్ లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మెగా డీఎస్సీని నిర్వహించింది. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం జూన్ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు రెండు విడతలుగా ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించారు. జూలై 5న ప్రాథమిక కీ, ఆగస్టు 1న ఫైనల్ కీ విడుదలైంది. ఇప్పటికే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఏడు విడతలుగా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను అధికారులు పూర్తి చేశారు. తాజాగా.. ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ 19న అమరావతిలో అపాయింట్‌మెంట్ ఆర్డర్లు అందజేయనున్నారు.

నారా లోకేశ్ అభినందనలు.. 

ఏపీ మెగా డీఎస్సీ -2025లో ఎంపికైన అభ్యర్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. apdsc.apcfss.in వెబ్‌సైట్‌లో ఈ అభ్యర్థుల ఎంపికల జాబితా లభ్యమవుతుందని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.

ప్రస్తుత డీఎస్సీలో అర్హత సాధించలేకపోయిన వారు నిరుత్సాహ పడొద్దు.. హామీ ఇచ్చినట్లుగా ప్రతీయేటా డీఎస్సీ నిర్వహించబడుతుంది. దృఢ సంకల్పంతో ఉండండి.. సిద్ధంగా ఉండి.. మీ అవకాశం మీ కోసం వేచి ఉంది.. అంటూ లోకేశ్ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అమరావతి సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం చేసిన దస్త్రం మెగా డీఎస్సీ. 150 రోజుల కంటే తక్కువ సమయంలో, పాఠశాల విద్యాశాఖ ఈ ప్రక్రియ ను విజయవంతంగా ముగించింది. తుది ఎంపిక జాబితాలో అర్హత పొందిన అభ్యర్థులందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ మైలురాయి బాధ్యతను మరింత పెంచింది. మన విద్యా వ్యవస్థను బలోపేతంచేస్తూ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దృష్టిని ప్రతి తరగతి గదికి తీసుకెళ్లేలా చేసిందని నారా లోకేశ్ పేర్కొన్నారు.