జూనియర్ ఎన్టీఆర్, లోకేష్‌పై ఎమ్మెల్యే కొడాలి నాని హాట్ కామెంట్స్

Kodali Nani Comments : టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్‌పై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి జరుగబోయే ఎన్నికల్లో నారా లోకేష్, చంద్రబాబును గెలిపిస్తే.. జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీలో నుంచి బయటకు తోసేస్తారని కొడాలి నాని వ్యాఖ్యానించారు.

Read Also : China defence budget : ప‌క్కా వ్యూహాంతో చైనా.. డిఫెన్స్ బ‌డ్జెట్ 7.2 శాతం పెంపు.. భార‌త బ‌డ్జెట్ ఎంతంటే?

పుట్టినరోజుకి, చావుకు తేడా తెలియని లోకేష్‌ను సీఎం చేయాలని జూనియర్ ఎన్టీఆర్‌పై కుట్రలు చేస్తూ.. అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. చిన్న ఎన్టీఆర్‌, పెద్ద ఎన్టీఆర్‌ను అభిమానించే ప్రతి ఒక్కరు చంద్రబాబును చిత్తుగా ఓడించాలన్నారు.

అప్పుడే టీడీపీ ఎన్టీఆర్ చేతిలోకి వెళ్తుందన్నారు. లోకేష్‌, చంద్రబాబుని గెలిపిస్తే.. సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగానే జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా బయటకు గెంటి టీడీపీను ఆక్రమించుకుంటారని కొడాలి నాని విమర్శలు గుప్పించారు.

120 సార్లు బటన్ నొక్కి పేద ప్రజలకు 2 లక్షల 50వేల కోట్లు ట్రాన్సాఫర్ చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి కోసం రాష్ట్ర ప్రజలు కూడా రెండుసార్లు ఈవీఎం బటన్ నొక్కాలని సూచించారు. చంద్రముఖిని ఈ ఒక్కసారి ఈవీఎంలో బంధిస్తే.. చంద్రబాబు అనే పేరు అంతరించిపోతుందని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also : YSRCP New Slogan : మీ కల నా కల.. సరికొత్త నినాదంతో ఎన్నికలకు సిద్ధమైన వైసీపీ

ట్రెండింగ్ వార్తలు