YSRCP New Slogan : మీ కల నా కల.. సరికొత్త నినాదంతో ఎన్నికలకు సిద్ధమైన వైసీపీ

6 వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు ఏర్పాటు చేస్తోంది వైసీపీ. మీ కల నా కల అంటూ వైఎస్ జగన్ ఫోటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తోంది.

YSRCP New Slogan : మీ కల నా కల.. సరికొత్త నినాదంతో ఎన్నికలకు సిద్ధమైన వైసీపీ

Updated On : March 5, 2024 / 10:18 PM IST

YSRCP New Slogan : ఓవైపు సిద్ధం సభలతో పొలిటికల్ హీట్ పెంచుతూనే మరోవైపు పబ్లిక్ అటెన్షన్ గ్రాబ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది వైసీపీ. నాకు ఒక కల ఉంది అంటూ కొత్త నినాదంతో ప్రచారం చేయనున్నారు సీఎం జగన్. 6 వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు ఏర్పాటు చేస్తోంది వైసీపీ. మీ కల నా కల అంటూ వైఎస్ జగన్ ఫోటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పల్లె, ప్రతి పట్టణంలో హోర్డింగ్ లు పెట్టనున్నారు. రైతు కల జగనన్న కల.. విద్యార్థుల కల జగనన్న కల.. అవ్వాతాతల కల జగనన్న కల.. అక్కా చెల్లెమ్మల కల జగనన్న కల.. యువత కల జగనన్న కల.. కార్మికుల కల జగనన్న కల.. అంటూ కొత్త నినాదాలతో ఎన్నికలకు వెళ్లనున్నారు వైసీపీ నేతలు.

Also Read : అమరావతి వర్సెస్ వైజాగ్.. వచ్చే ఎన్నికలు రాజధానిపై ప్రజా తీర్పేనా? ఏపీలో ఏం జరగనుంది?