Praveen Kumar Reddy
Praveen Kumar Reddy – Rachamallu Sivaprasad Reddy : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో నిన్నటి దినం దుర్దినం టీడీపీ ప్రొద్దుటూరు ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాత్రి 1 గంటకి తాను చేరుకోగా 2 గంటలకి డీఐజీ, ఎస్పీలు.. టీడీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు బస్ దగ్గరికి వచ్చి ఆయనను బయటికి పిలిచి అరెస్ట్ చేశారని వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడారు.
‘జైలుకు వెళ్లిన బాధ నాకు తెలుసు సార్ మీరు ఎలా అని చంద్రబాబును అడుగగా.. నియోజకవర్గ ప్రజల కోసం నీవు జైలుకు వెళ్లావు.. రాష్ట్ర ప్రజల కోసం నేను వెళ్తున్నాను’ అని ధైర్యం చెప్పాడని తెలిపారు. చంద్రబాబు మాటలు తనకు చాలా స్ఫూర్తిదాయకం అన్నారు. రాజకీయాల కోసం ఇలా చేస్తే వేరే పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తాయా అని నిలదీశారు. తమ నాయకుడు గొప్పవాడు.. చట్టాన్ని మనం గౌరవించాలి అన్నాడని పేర్కొన్నారు.
శనివారం చంద్రబాబు నాయుడుపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదన్నారు. రాచమల్లును కూడా జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. తమ నాయకుని అరెస్ట్ చేసిన బాధ వెంటాడుతోందన్నారు. చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు.
అవినాష్ రెడ్డిని కర్నూలులో అరెస్ట్ చేయాలంటే శాంతి భద్రతల విఘాతం కలుగుతుందన్నారని పేర్కొన్నారు. కానీ, చంద్రబాబు నాయుడును నంద్యాలలో అరెస్ట్ చేస్తే శాంతిభద్రతలకు విఘాతం కలగ లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు పోలీసు వ్యవస్థ నిదర్శనం అన్నారు.