Case On Ys Jagan : మాజీ సీఎం జగన్ పై గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ తో పాటు సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ పై కేసు ఫైల్ అయ్యింది. వీరితో పాటు మరికొంతమందిపైనా కేసు నమోదు చేశారు.
వైసీపీ ప్రభుత్వం హయాంలో తనను అరెస్ట్ చేసి తనపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేశారు రఘురామ కృష్ణరాజు. కస్టడీకి తీసుకున్న సమయంలో తనపై దాడి చేశారని ఆరోపించారు. ఈ కేసులో మాజీ సీఎం జగన్ ను ఏ-3గా చేర్చారు. ఏ-2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు పేర్లను చేర్చారు. ఏ-4గా విజయ్ పాల్, ఏ-5 గా డాక్టర్ ప్రభావతిని చేర్చారు. మాజీ సీఎం జగన్ ఒత్తిడి వల్లే తనను అరెస్ట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
2022లో ఏపీ సీఐడీ అధికారులు విచారణ నిమిత్తం రఘురామను గుంటూరు తరలించారు. విచారణ సమయంలో తన మీద ఇద్దరు వ్యక్తులు కూర్చుని, గుండెల మీద బాదారని గతంలో రఘురామ ఆరోపించారు. మాజీ సీఎం జగన్ ఒత్తిడితో తనపై దాడి చేశారని రఘురామ చెప్పారు. కక్షపూరితంగా తనపై కేసులు పెటి వేధించారని రఘురామ వాపోయారు. గత ప్రభుత్వం హయాంలో తనను ఇబ్బంది పెట్టాలనే ఇదంతా చేశారని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ1గా సునీల్, ఏ2గా సీతారామాంజనేయులు, ఏ3గా జగన్ ఉన్నారు. రఘురామకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లపైన కేసు నమోదైంది.
Also Read : టార్గెట్ జగన్..! శ్వేతప్రతాల వెనుక చంద్రబాబు భారీ వ్యూహం..!