చైనాలో చిక్కుకున్న తెలుగు ఇంజినీర్లు : సీఎం జగన్ తో మాట్లాడానన్న ఎమ్మెల్యే రోజా

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని ప్రభావం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను తాకింది. చైనాలోని వూహన్ నగరంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ

  • Publish Date - January 29, 2020 / 02:26 PM IST

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని ప్రభావం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను తాకింది. చైనాలోని వూహన్ నగరంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని ప్రభావం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను తాకింది. చైనాలోని వూహన్ నగరంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ ఇంజనీర్లు చిక్కుకుపోయారు. ఓ గదిలో బందీలుగా మారారు. లోపల ఉండలేక బయటకు రాలేక నరకం చూస్తున్నారు. తినడానికి తిండి కూడా దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 58మంది ఇంజినీర్లు వూహన్ నగరంలో చిక్కుకుపోయారు. ఏం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పిల్లల క్షేమ సమాచారం గురించి టెన్షన్ పడుతున్నారు.

వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా శ్రీసిటీ TCL కంపెనీ ఇటీవల క్యాంపస్ సెలక్షన్స్ లో భాగంగా Engineering College ల నుంచి యువ ఇంజనీర్లను రిక్రూట్ చేసుకుంది. వారిలో 96 మందిని శిక్షణ కోసం చైనా లోని వూహన్ కు పంపించింది. మొదటి విడతలో శిక్షణ పూర్తి చేసుకున్న 38మంది 2019 నవంబర్ లో భారత్ కి తిరిగి వచ్చారు. మరో 58 మంది వూహన్ లోనే ఉండి శిక్షణ పొందుతున్నారు.

వూహన్ సిటీలో చిక్కుకుపోయిన వారిలో చిత్తూరు జిల్లాకి చెందిన వారున్నారు. వీరిలో తిరుపతికి చెందిన యువ ఇంజనీర్ విష్ణుప్రియ ఒకరు. ప్రస్తుతం తామంతా గదిలోనే ఉంటున్నామని, వూహన్ నగరం దిగ్భందంలో ఉందని తండ్రి సుబ్రహ్మణ్యానికి చెప్పారు. ఇండియాకి తిరిగొద్దామని అనుకుంటున్నా.. వచ్చే అవకాశం లేదన్నారు. దీంతో తమ పిల్లలను కాపాడాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా స్పందించారు. వూహన్ లో చిక్కుకుపోయిన తెలుగు ఇంజినీర్లను సురక్షితంగా భారత్ కు తీసుకొస్తామన్నారు.

”ఉద్యోగం నిమితం చిత్తూరు జిల్లా శ్రీసిటీ TCL నుంచి 58 మంది వూహన్(wuhan) నగరానికి వెళ్లారు. కరోనా వైరస్(corona virus) కారణంగా వారంతా అక్కడ చిక్కుకుపోయారు. వారి పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు. అక్కడ వారిని ఎవరూ పట్టించుకోవడం లేదు. కరోనా వైరస్ కారణంగా తిండి కూడా దొరకడం లేదు. ఇంజినీర్లు భయబ్రాంతులు చెందుతున్నారు. కాపాడాలని నాకు మేసేజ్ వచ్చింది. దీన్ని సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి దృష్టికి తీసుకెళ్లాను. చైనా నుంచి విమానాల రాకపోకలు పునరుద్ధరణ తర్వాత.. వెంటనే వారందరిని స్వస్థలాలకు తీసుకొస్తాం” అని రోజా చెప్పారు.