ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల 

  • Publish Date - February 24, 2019 / 03:51 PM IST

ఢిల్లీ :  ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యుల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా షెడ్యూల్‌ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. 

తెలంగాణలోని మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు నోటిఫికేషన్‌ విడులైంది. వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా షెడ్యూల్‌ ప్రకటించింది. 

ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు మార్చి5 వరకు గడువుఉంది. మార్చి 6 నామినేషన్లు పరిశీలిస్తారు. మార్చి 8 న నామినేషన్ల ఉపసంహణకు గడువు ఉంది. రెండు రాష్ట్రాల్లో మార్చి 22న  ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మార్చి నెల 26న ఫలితాలు  వెల్లడిస్తారు. ఎమ్మెల్సీ  ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.ఈ మేరకు సోమవారం  ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతుంది. 

ట్రెండింగ్ వార్తలు