Nagababu: నాగబాబుకు కీలక పదవి.. గ్రీన్ కమిటీ ఛైర్మన్‌గా నియామకం.. ఏపీ ప్రభుత్వం అధికారిక జీవో
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన సీనియర్ నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు(Nagababu) బాధ్యతాయుతమైన పదవి దక్కింది.
- V Santhosh Kumar
- Published on- August 17, 2026 / 12:27 PM IST
mlc nagababu appointed as ap green executive committee chairman
- గ్రీన్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబు
- అటవీశాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు
- పర్యావరణ పరిరక్షణే ప్రధాన లక్ష్యం
Nagababu: ఆంధ్రప్రదేశ్ పర్యావరణ పరిరక్షణ, హరిత కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన సీనియర్ నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు(Nagababu) బాధ్యతాయుతమైన పదవి దక్కింది. రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ నాగబాబును ఆంధ్రప్రదేశ్ ‘గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ’ ఛైర్మన్‌గా నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
Smriti irani: బీజేపీలో స్మతి ఇరానీ రిటర్న్స్?.. కొత్త బాధ్యతలు..!
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా:
ఈ నియామకంతో రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించడం, అటవీ విస్తీర్ణం పెంపు, పర్యావరణ సమతుల్యత కాపాడటంలో నాగబాబు కీలక పాత్ర పోషించనున్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు హరిత ప్రాజెక్టుల అమలును ఈ కమిటీ పర్యవేక్షించనుంది.
ముందుకు సాగనున్న హరిత ప్రాజెక్టులు:
నాగబాబు నియామకంపై పార్టీ శ్రేణులు, మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పర్యావరణ హిత విధానాలను బలోపేతం చేసేందుకు, సరికొత్త గ్రీన్ కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా స్పష్టమవుతోంది.
