అనంతపురం జిల్లా నేతలు టీడీపీకి షాక్ ఇవ్వనున్నారు. ఎమ్మెల్సీ శమంతకమణి చేయనున్నారు.
ఏపీలో టీడీపీ నేతలు ఆ పార్టీకి వరుసుగా షాక్ లు ఇస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీని వీడుతున్నారు. ఇప్పటికే పార్టీని వీడిన వారు వైసీపీ చేరగా..మరికొందరు చేరేందుకు సిద్ధమవుతున్నారు. అనంతపురం జిల్లా నేతలు టీడీపీకి షాక్ ఇవ్వనున్నారు. టీడీపీకి ఎమ్మెల్సీ శమంతకమణి రాజీనామా చేయనున్నారు. మాజీ ఎమ్మెల్యే యామినీబాల కూడా పార్టీని వీడే ఛాన్స్ కనిపిస్తోంది. త్వరలో ఎమ్మెల్సీ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే యామినీబాల సీఎం జగన్ ను కలవనున్నారు. జగన్ కలిసిన తర్వాత వైసీపీ కండువా కప్పుకునే అవకాశం ఉంది.
ఏపీలో వలసల రాజకీయం కొనసాగుతోంది. అధికారం ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీలోకి తక్కెట్లో కప్పల్లా గెంతుతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీలోకి ప్రతిపక్ష టీడీపీలోంచి వలసలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కడప జిల్లాలో టీడీపీకి మరోషాక్ తగిలింది. మైనార్టీ సీనియర్ నేత సుభాన్ భాషా టీడీపీకి రాజీనామా చేశారు.
చంద్రబాబు, లోకేశ్ ల తీరు నచ్చటం లేదని సుబాన్ బాషా ఆరోపిస్తున్నారు. అందుకే టీడీపీకి రాజీనామా చేశానని తెలిపారు. అలా టీడీపీకి రాజీనామా చేసిన ఆయన వైసీపీ పార్టీ ఎంతో నచ్చేసిందట. అందుకే వెంటనే డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ఆధ్వర్యంలో వైసీపీలో చేరిపోయారు.
తాజాగా ..మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి..సోదరుడు ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ కూడా టీడీపీకి రాజీనామా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల టికెట్ల కేటాయింపులో కేఈ ప్రభాకర్ అసంతృప్తితో పార్టీని వీడినట్లుగా తెలుస్తోంది. (టీడీపీకి రాజీనామా చేసి..వైసీపీలో చేరిన మైనర్టీ నేత : కేఈ సోదరులదీ అదే దారా?!)
See Also | రెండు వారాలు పాటు ఐపీఎల్ వాయిదా?