MLC to Anandaiah: ఆనందయ్యకు ఎమ్మెల్సీ.. ఏపీ సీఎస్‌కు గవర్నర్ కార్యదర్శి లేఖ!

కరోనా కష్టకాలంలో సెకండ్ వేవ్ సమయంలో కృష్ణపట్నం ఆనందయ్య మందు గురించి ఎంతగా ప్రచారం జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Anandaiah: కరోనా కష్టకాలంలో సెకండ్ వేవ్ సమయంలో కృష్ణపట్నం ఆనందయ్య మందు గురించి ఎంతగా ప్రచారం జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కరోనాతో ఎంతోమంది చనిపోతున్న వేళ ఆనందయ్య అందరికీ గొప్పగా కనిపించాడు. దేశవ్యాప్తంగా ఆనందయ్య పేరు మార్మోగగా.. కరోనా మందు తయారుచేసిన ఆనందయ్యకు ఎమ్మెల్సీ పదవి అవకాశం కల్పించాలంటూ వెన్నెల ఫౌండేషన్ వైస్‌చైర్మన్, హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బీబీ హరిచందన్‌కు లేఖ రాశారు.

ఆనందయ్య లాంటి ప్రజలకు మేలు చేసే తలంపు ఉన్న వ్యక్తులను చట్టసభలకు నామినేట్ చేస్తే గౌరవంగా ఉంటుదని, ఈ విషయంలో ప్రభుత్వానికి సూచనలు చెయ్యాలంటూ గవర్నర్‌‍కు రాసిన లేఖలో న్యాయవాది సుంకర నరేష్ పేర్కొన్నారు. నరేష్ రాసిన లేఖపై స్పందించిన ఏపీ గవర్నర్ కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(3)(E) మరియు 171(5) ప్రకారం ఆనందయ్యను ఎమ్మెల్సీగా నియమించే అవకాశం పరిశీలించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. గవర్నర్ కార్యదర్శి తన లేఖపై స్పందించి సీఎస్‌కు లేఖ రాయడంపై నరేష్ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆనందయ్యను ఎమ్మెల్సీగా నియమిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు