బెస్ట్ ముఖ్యమంత్రులెవరంటే! సీఎం జగన్ 3 ప్లేస్..కేసీఆర్ 9వ స్థానం

  • Publish Date - August 8, 2020 / 11:17 AM IST

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం జగన్ థర్డ్ ప్లేస్ నిలిచారు. 2020, జులై 15 నుంచి జులై 27వ మధ్య Indiatoday Mood Of The Nation సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఈ వివరాలు బయటపడ్డాయ. అత్యుత్తమ సీఎంలలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ప్రథమ స్థానం, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచారు.



ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ 9వ స్థానంలో నిలవడం విశేషం. 19 రాష్ట్రాల్లోని 97 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరిగింది. జులై 15 నుంచి 27 మధ్య 12,021 మందితో టెలిఫోన్‌ ఇంటర్వ్యూ ద్వారా అభిప్రాయాలు సేకరించారు.



ముఖ్యమంత్రుల స్థానాలు
యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ 1, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 2. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డ 3. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ 4. ఇతరులు5. బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ 6. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే 7. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ 8. రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లట్‌ 10.