Moshen Raju
AP Legislative Council chairman : ఏపీ శాసన మండలి చైర్మన్ గా మోషేన్ రాజు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఒకే నామినేషన్ పడటంతో మోషేన్ రాజు ఏకగ్రీవంగా ఎంపిక కానున్నారు. శాసనమండలి చైర్మన్ గా మోషేన్ రాజు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.
ఏపీ శాసనమండలి చైర్మన్ ఎన్నికపై రేపు అధికారిక ప్రకటన రానుంది. రేపు మద్యాహ్నం 2 గంటలకు శాసన మండలిలో మోషేన్ రాజు ఎంపికను ప్రొటైం స్పీకర్ విఠపు బాలసుబ్రమణ్యం ప్రకటించనున్నారు.