YS viveka Case : వివేకానంద రెడ్డి హత్య గురించి ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన వీడియో

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి హత్య తరువాత ఏం జరిగిందో వివరిస్తు ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్న కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పలు అంశాలు వెల్లడిస్తు వీడియో రిలీజ్ చేశారు.

MP Avinash Reddy On YS Viveka Incident

YS viveka Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి హత్య తరువాత ఏం జరిగిందో వివరిస్తు ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్న కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పలు అంశాలు వెల్లడిస్తు వీడియో రిలీజ్ చేశారు. వివేకా హత్య తరువాత ఎర్రగంగిరెడ్డి కీలక డాక్యుమెంట్లను తీసుకెళ్లిపోయాడని..వివేకా తనకున్న పావలా భాగాన్ని (వివేకా రెండో భార్య అనే వార్తలు )షమీమ్, వాళ్ల కొడుకు పేరుతో వీరునామా రాశారని అన్నారు. ఈ పావలా వాటా వారికి చెందకూడదనే ఉద్ధేశ్యంతో వివేకాను చంపేశారని అన్నారు. అలాగే షమీమ్ కుటుంబానికి రాసిచ్చిన ఇంటినికూడా బలవంతంగా రాయించుకున్నారని డాక్యుమెంట్లను చోరీ చేసి వివేకాను చంపాలని సునీత భర్త రాజశేఖర్ రెడ్డి అన్నారు అంటూ సునీతా..ఆమె భర్తపై వీడియోలో ఆరోపించారు అవినాశ్ రెడ్డి.

రాజశేఖర్ రెడ్డే వివేకాను చంపారనే కోణంలో విచారణ మొదలైన తరువాత సిట్ విచారణ వద్దని సీబీఐ విచారణ జరిపించాలని వారు డిమాండ్ తెరమీదకు తెచ్చారంటూ చెప్పుకొచ్చారు అవినాశ్. రాజశేఖర్ రెడ్డి పాత్రపై అధికారులకు అనుమానం వచ్చినతరువాతే సునీత సీబీఐ విచారణ కావాలని పట్టుబట్టి సీబీఐను ఎంటర్ చేశారని పేర్కొన్నారు. బెంగళూరు సెటిల్ మెంట్ లో గొడవ జరిగిందని దస్తగిరి అప్రూవర్ గా చెప్పిన లాజిక్ అంతా అబద్దమని అన్నారు అవినాశ్ రెడ్డి. వివేకా రెండో భార్యకు ఆస్తులు వెల్లకూడదనే ప్రధాన ఉద్ధేశంతోనే ఈ హత్య చేయించారని వీడియో తెలిపారు.

వివేకా హత్య జరిగిన రోజు ఆ ప్రదేశంలో లభించిన లేఖను దాచిపెట్టారని..ఆ లేఖను దాచిపెట్టాలని వివేకా పీఏ కృష్ణారెడ్డికి వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి సూచించారని మరోసారి వీడియో ద్వారా ఆరోపించారు ఎంపీ అవినాష్ రెడ్డి.సునీతాను, ఆమె భర్తను కాపాడటానికి సీబీఐ అధికారులు ఇలా  చేస్తున్నారా? అంటూ మరోసారి సీబీఐ అధికారులపై కూడా ఆరోపణలు చేశారు అవినాశ్ రెడ్డి.

అలాగే సిట్ దర్యాప్తులో తన భర్త ఇరుక్కుపోతున్నడనే భయంతోనే సునీత సీబీఐ దర్యాప్తుకు పట్టుపట్టారని సునీతమ్మ తన తండ్రి హత్య గురించి పోరాడుతోంది అంటూ అందరు ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారని కానీ అదంతా పోరాటం కాదు ఆరాటం అంతకంటే కాదు..ఈ కేసులోంచి ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి బయటకు రావాలి అదే సమయంలో నేను మానాన్న ఈ కేసులో ఇరుక్కోవాలి అదే సునీత ప్లాన్ అంటూ వీడియోలో అవినాశ్ పేర్కొన్నారు. ఇంత చేసినా సునీతపై మాకు గౌరవం ఉందంటూ చెప్పుకొచ్చారు.