YS Vifeka case Avinash redddy
YS Viveka Case : వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో మరోసారి విచారణకు రావాలని ఈ కేసులు అంత్యత కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.ఈ నోటీసులను బట్టి అవినాశ్ రెడ్డి ఈరోజు అంటే మే 16 (2023)న హైదరాబాద్ లోని సీబీఐ ఆఫీసుకు విచారణకు హాజరుకావాల్సి ఉంది.
కానీ తానువిచారణకు హాజరుకాలేనని అత్యవసర పనులు ఉన్నాయి అంటూ అవినాశ్ సీబీఐ అధికారులకు లేఖ రాశారు. నాలుగు రోజులు గడువు కావాలని కోరుతు అవినాశ్ రెడ్డి లేఖకు సీబీఐ అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. అవినాశ్ విజ్ఞప్తిని సీబీఐ అధికారులు అంగీకరించారు. నాలుగు రోజుల తరువాత విచారణకు హాజరు అవుతాను అంటూ లేఖలో అవినాశ్ విన్నపాన్ని మన్నించిన సీబీఐ సరేనంది. అనుమతినిచ్చింది. దీంతో అవినాశ్ నాలుగు రోజుల తరువాత సీబీఐ విచారణకు హాజరు అవుతారా?లేదా ఇంకా ఏమైనా సాకులు చెప్పి ఎస్కేప్ అవుతారా?అనేది తెలియాల్సి ఉంది.
కాగా ఇప్పటికే అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు పలుమార్లు హాజరయ్యారు. దీంతో ఏం సమయంలో అయినా అరెస్ట్ జరగొచ్చు అనే సంకేతాలు వెలువడ్డాయి. కానీ అనూహ్యంగా సీబీఐ అవినాశ్ ను అరెస్ట్ చేయకుండా కేవలం విచారించి వదిలేసింది. అవినాశ్ అరెస్ట్ అనివార్యం అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని అటు సుప్రీంకోర్టుకు, ఇటు తెలంగాణ హైకోర్టు కూడా తెలిపిన సీబీఐ పలు కీలక పరిణామాల మధ్య ఇప్పటికి అరెస్ట్ చేయకపోవటంపై పలు విమర్శలు అనుమానాలు వస్తున్నాయి. కానీ సీబీఐ మాత్రం వివేకా కేసులో ఆధారాలను అవినాశ్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డి మాయం చేశారని..చెబుతునే మరోపక్క విచారణలోనే సరిపెడుతోంది. అవినాశ్ ఎన్నిసార్లు సీబీఐ విచారణకు హాజరైనా విచారణకు సహకరించటంలేదని సీబీఐ చెబుతోంది. ఈ క్రమంలో మరోసారి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయగా..అవినాశ్ మరోసారి ఎస్కేప్ అయ్యారు. నాలుగు రోజులు గడువు అడిగారు.దానికి సీబీఐ కూడా అంగీకరించింది. దీంతో అవినాశ్ అరెస్ట్ జరిగేనా? ఈ కేసు విచారణ ఎప్పటికి ముగుస్తుంది? దోషులు నిర్ధారణ అవుతుందా? వారికి శిక్ష పడుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వివేకానంద మృతి కేసులో సీబీఐ ఇప్పటికే సాక్షుల నుంచి కూడా ఎన్నో విషయాలను రాబట్టింది. ఈ కేసులో అధికారులు విచారణ జరుపుతున్న కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఏ1 నిందితుడుగా ఉన్న గంగిరెడ్డి ఇటీవలే నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు.ఇటీవల అవినాశ్ ను సీబీఐ అధికారులు విచారించిన సమయంలో ఆయనను అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. అయితే, ఆయనను అరెస్టు చేయలేదు. అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఆ సమయంలో హైదరాబాద్‌కు ఎంపీ అవినాశ్‌రెడ్డి కూడా వచ్చారు.
ఆ సమయంలో సీబీఐపై పలు వ్యాఖ్యలు చేశారు. అర్థం పర్థం లేని విషయాలను సీబీఐ పెద్దగా చూపుతోందన్నారు. విచారణలో అధికారులు పలు అంశాలను విస్మరిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై ఇప్పటికే సీబీఐ ఉన్నాధికారులకు తెలిపామని అన్నారు. రెండో భార్యకు ఆస్తి రావాలని వివేక భావించారని, వాస్తవాల ఆధారంగా విచారణ జరపాలని చెప్పారు. ఇలా కీలక మలుపులు తిరుగుతున్న వివేకా కేసు మిస్టరీ ఎన్నటికి వీడేనో..తన తండ్రిని అత్యంత దారుణంగా హత్య కేసిన వారికి శిక్ష పడాలనే సునీతారెడ్డి పోరాటానికి న్యాయం దక్కుతుందా? ఎన్నటికీ అనే వాదన వినిపిస్తోంది.